Movie News

వారియర్ దర్శకుడికి అంత సీన్ ఉందా

ఒకప్పుడు పందెం కోడి, రన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉండొచ్చేమో కానీ గత కొంత కాలంగా దర్శకుడు లింగుస్వామి ఇస్తున్న ఫ్లాపులు మామూలువి కాదు. ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం మాధవన్ వెట్టై తర్వాత మళ్ళీ సక్సెస్ చూడనే లేదు. పందెం కోడి 2 సోసోగా అడగా అంతకు ముందు సూర్య సికందర్ (అంజాన్) దారుణంగా పోయింది. ఇవన్నీ పట్టించుకోకుండా 2022లో మన రామ్ నమ్మి అవకాశం ఇస్తే ది వారియర్ అంటూ రొట్ట రొటీన్ కథతో సూపర్ డిజాస్టర్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆఫర్ లేదు. తాజాగా ఆయన పేల్చిన బాంబు వింటే ఆశ్చర్యం షాక్ రెండూ ఒకేసారి కలుగుతాయి.

త్వరలో తాను మహాభారత కథను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఏకంగా ఏడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. అర్జునుడు – అభిమన్యుడు పాత్రలను హైలైట్ చేస్తూ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ వాడి ఇప్పటిదాకా చూడని ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. నిర్మాత ఎవరయ్యా అంటే త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి, వేచి చూడమని చెబుతున్నారు. తమిళంలో అరవై ఏళ్ళ క్రితం శివాజీ గణేశన్ కర్ణన్ తర్వాత మళ్ళీ ఎవరూ ఈ గాథని టచ్ చేయలేదు. ఇప్పుడు లింగుస్వామి ఇంత పెద్ద స్కేల్ లో అది కూడా తండ్రి కొడుకుల ఎపిసోడ్ మీద ఎక్కువ దృష్టి పెడతానని చెప్పడం ఊహించని ట్విస్టు.

సరే ప్రకటన వచ్చే దాకా నమ్మలేం కానీ నిజంగా లింగుస్వామికి అంత సీన్ ఉందా అనేదే పెద్ద ప్రశ్న. గతంలో సుందర్ సి ఇదే తరహాలో బాహుబలిని తలదన్నే రీతిలో సంఘమిత్రని తెరకెక్కిస్తానని ఓపెనింగ్ చేసి, పోస్టర్ కూడా వదిలారు. మల్టీస్టారర్స్ ని పెట్టుకున్నారు. తీరా చూస్తే అది రెగ్యులర్ షూట్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇది జరిగి దశాబ్దం దాటిపోయింది. మరి లింగుస్వామి అయినా చెప్పిన మాట ప్రకారం తీస్తారో లేదో చూడాలి. అయినా పులిని చూసి వాత పెట్టుకున్నట్టు కోలీవుడ్ దర్శకులు రాజమౌళిని మరిపించేలా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కటి వర్కౌట్ కాకపోవడం బ్యాడ్ లక్.

This post was last modified on February 22, 2025 9:53 pm

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

2 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

4 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

5 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

6 hours ago