Movie News

థియేటర్ లో నాన్ స్టాప్ యాడ్స్ : లక్ష ఫైన్ వేసిన కోర్టు!

బెంగళూరులోని వినియోగదారుల కోర్టు సినిమా ప్రదర్శనలో ప్రకటనల వ్యవహారంపై కీలక తీర్పు ఇచ్చింది. 2024లో విడుదలైన సామ్ బహదూర్ సినిమా ప్రదర్శనకు ముందుగా, సుమారు 25 నిమిషాల పాటు ప్రసారమైన కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తన సమయాన్ని వృథా చేశాయని అభిషేక్ ఎం.ఆర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా ముగిసిన వెంటనే తన పనులకు వెళ్లాల్సి ఉండడంతో ఈ ఆలస్యం తీవ్ర అసౌకర్యం కలిగించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు పీవీఆర్ సినిమాస్ షో పట్ల తప్పుబట్టింది. సినిమా అసలు ప్రారంభ సమయాన్ని టికెట్లపై స్పష్టంగా చూపించాలని ఆదేశించింది. బుక్ మై షోకు ఈ వ్యవహారంలో ఎటువంటి బాధ్యత లేదని కోర్టు పేర్కొన్నప్పటికీ, థియేటర్లు మాత్రం ప్రేక్షకుల సమయాన్ని వ్యర్థం చేయడం న్యాయసమ్మతం కాదని తేల్చింది.

తమ థియేటర్లలో ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనల సమయాన్ని పెంచుతున్నామని పీవీఆర్, ఐనాక్స్ కోర్టులో వాదించాయి. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సమయానికి వచ్చిన ప్రేక్షకులను 25-30 నిమిషాలు ప్రకటనలు చూడమని అనడం అన్యాయమని పేర్కొంది. సినిమా టికెట్‌లో ప్రకటనలకు వెచ్చించే సమయాన్ని కాకుండా, నిజమైన షో టైమ్‌ను చూపించాలనే తీర్పును ఇచ్చింది.

ఈ తీర్పులో భాగంగా, పీవీఆర్, ఐనాక్స్‌లను అభిషేక్ ఎం.ఆర్‌కు ₹20,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల కోసం ₹8,000 చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రూ.1 లక్షను శిక్షార్హమైన నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత థియేటర్లలో ప్రకటనల వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలవుతాయని భావిస్తున్నారు.

This post was last modified on February 19, 2025 10:00 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

16 minutes ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

23 minutes ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

5 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

7 hours ago