ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి స్థిరపడ్డ కథానాయిక ఇలియానా. హిందీలో బర్ఫీ సహా కొన్ని మంచి సినిమాలు చేశాక ఆమె నెమ్మదిగా సినీ రంగానికి దూరమైంది. కొన్నేళ్ల కిందట ఆమె మైకేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇలియానా గర్భవతి అయ్యేవరకు వీరి బంధం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. బిడ్డను కన్నపుడే భర్త గురించి కూడా వెల్లడించింది.
2023లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి పేరు.. కోవా ఫోనిక్స్ డోలన్. ఐతే రెండేళ్లు తిరిగేలోపే ఇలియానా మళ్లీ ప్రెగ్నెంట్ అయిందని, రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని నెల కిందట మళ్లీ ప్రచారం మొదలైంది. నిన్నటిదాకా ఇది జస్ట్ రూమరే. కానీ ఇప్పుడు ఆ విషయం వాస్తవమే అని వెల్లడైంది. స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. ఇలియానా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు చూస్తే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం నిజమే అని తెలుస్తుంది.
కుర్‌కురేతో పాటు ఆంటాసిడ్ చ్యూయింగ్ గమ్స్ ప్యాకెట్లు కనిపిస్తున్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఇవి రెండూ పుల్లగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ”మీరు ప్రెగ్నెంట్ అని చెప్పకుండా ప్రెగ్నెంట్ అని తెలియజేయండి” అనే క్యాప్షన్ సైతం ఇలియానా జోడించింది. దీంతో అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు ఇలియానాకు శుభాకాంక్షలు అంటూ మెసేజ్‌లు వెల్లువెత్తాయి.
వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డాక ఇలియానా సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. బిడ్డకు జన్మనిచ్చాక అసలు లైమ్ లైట్లో లేదు. తన ఫ్యామిలీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. చివరగా ఆమె తెలుగులో 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 15, 2025 9:01 pm
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…