మావయ్యలంటే విపరీతమైన ప్రాణం, అభిమానం చూపించే సాయి ధరమ్ తేజ్ వాళ్ళ పక్కన నటించే ఛాన్స్ కోసం కెరీర్ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అదృష్టం కొద్దీ బ్రోలో పవన్ కళ్యాణ్ తో సమానంగా స్క్రీన్ పంచుకునే అదృష్టం దక్కింది. ఫలితం సంగతి పక్కనపెడితే మళ్ళీ ఇలాంటి అవకాశం అంత సులభంగా దొరకదు.
రోజుల తరబడి ఇద్దరూ సెట్స్ మీద ఉండటం, స్క్రీన్ మీద చూసుకుని మురిసిపోవడం ఎప్పటికీ అలా గుర్తు ఉండిపోతుంది. ఇప్పుడు పెద్ద మావయ్యతో కూడా ఆ ఛాన్స్ కొట్టేసినట్టు లేటెస్ట్ అప్డేట్. విశ్వంభరలో ఈ కలయిక చిన్న శాంపిల్ గా చూడొచ్చని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతోంది. అందులోనే సాయి తేజ్ ఎంట్రీ ఉండొచ్చట. చిన్న బిట్ అయినా అది స్పెషలే అవుతుంది. చిరుతో ఇలా కాంబోలు పంచుకోవడం మెగా హీరోలు గతంలో చేసిందే. శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటలో ఒకేసారి, శంకర్ దాదా జిందాబాద్ ఫైట్ లో మరోసారి పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కలిసి నటించాడు.
ఇదే సినిమా సాంగ్ లో అల్లు అర్జున్ అలా తళుక్కున మెరిసి మావయ్యకు ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. చిరు, నాగబాబులు ఎనభై దశకంలోనే జంటగా కనిపించారు. చరణ్ – చిరు ఖైదీ నెంబర్ 150, ఆచార్య, మగధీర, బ్రూస్ లీలో కలిసి అలరించారు.
ఇదే విశ్వంభరలో నీహారిక కూడా ఉంటుందట. సైరాలో కనిపించి కనిపించకుండా మాయమైన సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న విశ్వంభర ఇంకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. మే 9 లేదా జూన్ 27 రెండు ఆప్షన్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఫైనల్ కాపీ సిద్ధమవుతున్న టైంలో నిర్ణయం తీసుకుందామని అనుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో సిస్టర్, చైల్డ్ సెంటిమెంట్ తో పాటు బోలెడు యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఆస్కార్ విజేత కీరవాణి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట.
This post was last modified on February 15, 2025 6:55 pm
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…