Movie News

ఈ సినిమాలని… వైసీపీ వాళ్ళే డిజాస్టర్స్ చేశారట!

సోషల్ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వల్ల సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల రీచ్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో సినిమాల మీద ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీని స్ప్రెడ్ చేసి దెబ్బ తీసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కొత్తగా ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌లు కొన్ని తయారై.. సినిమాలను టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది.

బాలీవుడ్లో కొన్ని సినిమాలను ఇలాగే దెబ్బ తీయడమూ తెలిసిందే. కానీ ఒక దశ దాటాక వీళ్ల తీరు శ్రుతి మించి.. ప్రేక్షకులు వాళ్లకు రిటార్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ‘పఠాన్’ లాంటి సినిమాలు వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాయి.

తెలుగు విషయానికి వస్తే.. ఒక స్టార్ హీరో అభిమానులు, ఇంకో స్టార్ హీరో సినిమాను టార్గెట్ చేయడం.. వాళ్లు ఈ హీరో సినిమా వచ్చినపుడు బదులు తీర్చుకోవడం జరుగుతోంది. ఐతే సినిమాలో కంటెంట్‌తో సంబంధం లేకుండా వీళ్లు వాటి రిజల్ట్‌ను నిర్దేశిస్తారా అంటే ఔనని సమాధానం చెప్పలేం. ఈ నెగెటివిటీ ఎఫెక్ట్ కొంతమేరే ఉంటోంది. ఏదైనా కంటెంట్‌ను బట్టే ఫలితం ఉంటుందన్నది వాస్తవం.

కానీ కొందరు మాత్రం ఫలానా సినిమాను మేమే హిట్ చేశాం అని.. ఇంకో సినిమాను డిజాస్టర్ చేశాం అని జబ్బలు చరుచుకోవడం ట్రెండుగా మారింది. సినీ అభిమానులకు తోడు.. రాజకీయ పార్టీల మద్దతుదారులు కూడా ఈ విషయంలో క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా హడావుడి ఇలాగే ఉంది. తాము పెద్ద హిట్ చేసిన, అలాగే డిజాస్టర్లు చేసిన సినిమాల లిస్ట్ పోస్ట్ చేస్తూ వాళ్లకు వాళ్లు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు.

కొంత మంది వ్యతిరేకించిన అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప-2’కు తాము సపోర్ట్ చేసి పెద్ద హిట్ చేశామని వైసీపీయన్స్ అంటున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమా ‘మట్కా’ డిజాస్టర్ కావడానికి.. సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ దెబ్బ తినడానికి తామే కారణం అంటున్నారు. అంతే కాక లేటెస్ట్‌గా వాళ్లు బాయ్‌కాట్ చేయాలని పిలుపు ఇవ్వడం వల్లే ‘లైలా’ కూడా డిజాస్టర్‌గా తేలిందని అంటున్నారు.

ఐతే ఆయా చిత్రాలకు రిలీజ్ ముంగిట ఉన్న హైప్, కంటెంట్‌ను బట్టి వీటి ఫలితాలు ఉన్నాయి తప్ప ఎవరో పనిగట్టుకుని డిజాస్టర్లు చేయడం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న. ‘మట్కా’ సినిమాకు ముందు నుంచి హైప్ లేదు. వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డు దెబ్బ తింది. అన్ సీజన్ అయిన నవంబరులో రిలీజైంది. పైగా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టే ఆ ఫలితం వచ్చింది.

‘గేమ్ చేంజర్’ వీక్ మూవీ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. చాలా ఆలస్యం కావడం వల్ల ప్రి రిలీజ్ హైప్ కూడా తక్కువే. దీనికి డివైడ్ టాక్ వస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఆ సినిమా ఎలా నిలబడుతుంది? ఇక లేటెస్ట్ మూవీ ‘లైలా’ విషయానికి వస్తే.. వైసీపీ వాళ్లు రిలీజ్ ముంగిట ‘బాయ్‌కాట్’ ట్రెండ్ చేశారు. ఇప్పుడు సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో దాని రిజల్ట్‌ను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు.

కానీ ‘లైలా’ ఎంత పేలవమైన సినిమా అన్నది ఫస్ట్ షో పడగానే అందరికీ అర్థమైంది. విశ్వక్ కెరీర్లో ఇది అతిపెద్ద ఫ్లాప్ మూవీ అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. మరి అలాంటి సినిమాను ఒకరు పనిగట్టుకుని డిజాస్టర్ చేయడం ఏముంది? వచ్చిన టాక్‌తో దానంతట అదే డిజాస్టర్ అయింది. కాబట్టి ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌లు సినిమాల వసూళ్లను కొంతమేర ప్రభావితం చేయగలవేమో కానీ.. ఓవరాల్‌ రిజల్ట్‌ను నిర్దేశించే స్థాయి ఎవరికీ లేదని అర్థం చేసుకుంటే మంచిది.

This post was last modified on February 15, 2025 2:12 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago