ఈ ఇంటర్నెట్ జమానాలో ఎవరెందుకు ఫేమస్ అవుతారనేది ఎవరికీ తెలీదు. ఏ పాటకు అయినా పిచ్చి డాన్సులు చేసి తమ పిచ్చి చేష్టలతోనే పాపులర్ కావాలని చూసే వాళ్లను జనం పాపులర్ చేసేస్తుంటారు. టీజర్లో కన్ను కొట్టిన పిల్లను జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ చేసేసి సెలబ్రిటీలతో కూడా ట్వీట్లు పెట్టించేస్తారు.
తాజాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ టెన్షన్‍లో గోళ్లు కొరుకుతూ కనిపించిన ఒక సుందరి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది. ముంబయి వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్ గుర్తుంది కదా. ఆ మ్యాచ్‍లో గ్యాలరీలో కూర్చుని గోళ్లు కొరుకుతూ కనిపించిన సుందరి పేరు రియానా లాల్వాణి. అసలే ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తోన్న పోటీలు కనుక వున్న ఆ కొందరిలో రియానానే కెమెరాలు అధికంగా కవర్ చేసాయి. దీంతో ఆమె ‘సూపర్ ఓవర్ గాళ్’గా పేరు తెచ్చుకుంది.
ఒక్క రోజులో ఆమె ఇన్‍స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ వేలకి వేలు దాటేసింది. తన బయో చూసిన వాళ్లకు క్లారిటీ ఇస్తూ ఆమె ‘సూపర్ ఓవర్ గాళ్’ అని ఎడిట్ చేసింది. ఈ పాపులారిటీతో త్వరలో ఆమెకు బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. మామూలుగా అయితే ఇదో పెద్ద న్యూస్ అవ్వాలి. కానీ ఈ టిక్‍టాక్ యుగంలో ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చులెండి.
This post was last modified on October 21, 2020 11:05 pm
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డుకు చాలా విశిష్ఠత ఉంది. ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ఆరుగురు సభ్యులతో ఏర్పడిన…
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…