ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబుకు గురువారం భారీ ఊరట లభించింది. టీవీ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చాలా కాలంగా బెయిల్ కోసం ఎదురు చూస్తున్న మోహన్ బాబు ఊపిరి పీల్చుకున్నారు.
తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు అక్కడ నిరాశ ఎదురు కాగా… ఆ తర్వాత ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చాలా రోజుల క్రితమే మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేసినా… గురువారం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తన చిన్న కుమారుడు మంచు మనోజ్ తో మోహన్ బాబుకు ఆస్తి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు నిలవగా… మనోజ్ మాత్రం తన సతీమణి భూమి మౌనికతో కలిసి పోరాటం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వివాదం రేగిన ఆదిలోనే జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు మనోజ్ వచ్చారన్న సమాచారంతో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో మోహన్ బాబు ముందు మైక్ పెట్టిన ఓ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టుకు గాయాలు కాగా… చాలా రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు కాగా…పోలీసులు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటున్నానని, విచారణకు తాను తర్వాత హాజరవుతానని చెబుతూవచ్చిన మోహన్ బాబు… బెయిల్ కోసం యత్నాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో తొలుత హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు… ఆ తర్వాత నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే…ఇప్పటికీ మోహన్ బాబు ఇంట ఆస్తుల పంచాయతీ ఇంకా తెగనేలేదు. పోలీసులను దాటేసిన ఈ పంచాయతీ.. ప్రస్తుతం రెవెన్యూ అధికారుల హయాంలో కొనసాగుతోంది.
This post was last modified on February 13, 2025 2:53 pm
ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…
గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ…
నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ కు భారీ స్పందన కనిపిస్తోంది. దేవర, సలార్ తరహా షేడ్స్…
భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచిన రజత్ కుమార్ జీవితంలో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్…
నాగచైతన్య కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచే దిశగా వెళ్తున్న తండేల్ ఆరు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ట్రేడ్…