Movie News

జబర్దస్త్, ఢీ ప్రోగ్రాంలకు కరోనా షాక్

సినీ, టీవీ పరిశ్రమలను కరోనా వదలట్లేదు. వైరస్ ప్రభావం గతంతో పోలిస్తే తగ్గి, దాని గురించి జనాలు భయపడటం తగ్గించేసినా.. పూర్తిగా విస్మరించే పరిస్థితి అయితే లేదు. ఇటీవలే చాలా ఉత్సాహంగా షూటింగ్ పున:ప్రారంభించుకున్న ‘టక్ జగదీష్’ టీం.. యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో వెంటనే ప్యాకప్ చెప్పేయడం, అందరూ క్వారంటైన్ అయిపోవడం తెలిసిన సంగతే.

టీవీ రంగంలో కూడా ఇలాంటి పరిణామాలే చాలా జరిగాయి. తాజాగా కరోనా ప్రభావం ఈటీవీలో ప్రసారమయ్యే ఫేమస్ షోలు జబర్దస్త్, ఢీలపై పడింది. ఈ కార్యక్రమాల్లో కీలక వ్యక్తి అయిన సుడిగాలి సుధీర్‌కు కరోనా సోకినట్లు వెల్లడైంది. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో అతను వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్‌గా తేలింది. దీంతో జబర్దస్త్, ఢీ ప్రోగ్రాంల నిర్వాహకులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.

‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో సుధీర్‌తో కలిసి స్కిట్లు చేసే రామ్ ప్రసాద్, సన్నీ తదితరులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అలాగే ‘ఢీ’ ప్రోగ్రాంలో సుధీర్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లకూ పరీక్షలు జరిపారు. ఎవరికీ పాజిటివ్ లేదనే అంటున్నారు. ఐతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించబోతున్నారు. సుధీర్‌కైతే తీవ్ర లక్షణాలేమీ లేకపోవడంతో అతను హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు.

రెండు మూడు వారాలు అతను జబర్దస్త్, ఢీ షోల్లో కనిపించే అవకాశం లేనట్లే. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొత్తంగా అతడి టీం స్కిట్లే ఆగిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ‘జబర్దస్త్’లో పూర్తిగా హైపర్ ఆది టీం హవా నడిస్తే.. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో సుధీర్ టీం స్కిట్లే హైలైట్ అవుతుంటాయి. ఆ షోలో వాళ్లదే టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి కొన్ని వారాలు ఈ టీం స్కిట్లు ఆగిపోతే షోకు ఆదరణ తగ్గిపోవడం ఖాయం.

This post was last modified on October 21, 2020 7:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

2 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

3 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

4 hours ago