టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు కేవలం క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేసిన నాని.. ఆ తర్వాత మాస్ సినిమాలు కూడా చేసి ఆ వర్గంలోనూ ఆదరణ సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకూ తన మార్కెట్ కూడా విస్తరిస్తోంది. దసరా, హాయ్ నాన్న, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నాని.. ప్రస్తుతం ‘హిట్-3’ లాంటి క్రేజీ మూవీలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అతను ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘ప్యారడజ్’ మూవీని మొదలుపెట్టబోతున్నాడు. ఐతే ఓవైపు సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో కొత్త కథలు విని ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెడుతుంటాడు నాని. ఈ క్రమంలోనే అతను ఒక డ్రీమ్ కాంబినేషన్లో సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అరుదైన దర్శకుల్లో ఒకడిగా పేరున్న శేఖర్ కమ్ములతో నాని జట్టు కట్టబోతున్నాడన్నది తాజా సమాచారం.
నాని ఒకప్పటి ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే.. శేఖర్ కమ్ముల అతడికి బాగా సూటయ్యే దర్శకుడని చెప్పొచ్చు. వీరి కలయికలో సినిమా వస్తే బాగుంటుందని ఇరువురి అభిమానులూ కోరుకున్న వారే. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు ఈ కాంబోలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నానిలా కమ్ముల స్పీడుగా సినిమాలు చేసే రకం కాదు. సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. మేకింగ్ కూడా టైం పడుతుంది.
ప్రస్తుతం ఆయన ధనుష్‌తో ‘కుబేర’ తీస్తున్నాడు. అది చివరి దశలో ఉంది. వేసవిలోనే ఈ సినిమా విడుదల కానుంది. నాని-కమ్ముల సినిమాకు ప్రాథమికంగా చర్చలు జరిగాయని.. త్వరలోనే సినిమా ఓకే అవుతుందని.. ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు. నాని ‘ప్యారడైజ్’ పూర్తి చేసే సమయానికి కమ్ముల ఖాళీ అయ్యే అవకాశముంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కొచ్చు.
This post was last modified on February 12, 2025 4:48 pm
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో…
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ స్థానమేంటో, ఆయన స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి ‘బ్రహ్మా ఆనందం’ సినిమా…
ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి చెందిన యువ నేతలు ఒక్కొక్కరుగా ఆక్టివేట్ అయిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా…