Movie News

తమిళ స్టార్‌ను మనోళ్లే కాపాడాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో చివరగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అజిత్. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన నీర్కొండ పార్వై, వలిమై, తునివు ఓ మోస్తరుగా ఆడాయి. అజిత్ స్టార్ పవర్ వల్ల వీటికి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ఆ తర్వాత బలంగా నిలబడలేకపోయాయి. ఇక లేటెస్ట్‌గా రిలీజైన అజిత్ సినిమా ‘విడాముయర్చి’.. ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ముందు అనుకున్నట్లు సంక్రాంతి టైంలో వస్తే సినిమా బెటర్‌గా పెర్ఫామ్ చేసేదేమో కానీ.. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజై, బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకుంది. తెలుగులో అయితే ఈ సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన లైకా ప్రొడక్షన్స్‌ను ఈ సినిమా ఇంకా పెద్ద దెబ్బ కొట్టింది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోగా.. హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్’ను ఫ్రీమేక్ చేసినందుకు వారికి చెల్లించిన డబ్బులు అదనపు భారం అయ్యాయి.

లైకా సంగతి పక్కన పెడితే.. కొన్నేళ్ల ముందు వరకు స్టార్ పవర్‌లో విజయ్‌కి దీటుగా నిలిచిన అజిత్.. ఇప్పుడు తన ముందు వెలవెలబోయే పరిస్థితి. విజయ్ సినిమాల నుంచి నిష్క్రమించబోతున్న తరుణంలో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి తాను అర్హుడినని అజిత్ చాటాల్సి ఉంది. అతడికి పెద్ద హిట్ ఇచ్చే బాధ్యత తెలుగు వారి మీదే ఉండడం గమనార్హం.

అజిత్ కొత్త చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని. ఇప్పటికే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ అధినేతలు.. ఈ మూవీతో తమిళంలో అడుగు పెడుతున్నారు. ‘విడాముయర్చి’ డిజాస్టర్ అయినా.. ఆ ప్రభావం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మీద పడనట్లే కనిపిస్తోంది. సినిమాకు మంచి హైప్ ఉంది. అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

అతను చివరగా ‘మార్క్ ఆంటోనీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అజిత్‌ను అభిమానులు చూడాలని కోరుకునే మాస్ పాత్రను చేస్తున్నాడిందులో. సినిమా కూడా ఊర మాస్‌గా ఉండబోతోంది. ‘విడాముయర్చి’ని చేదు జ్ఞాపకాలను చెరిపివేసేలా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ చిత్రంపై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఏప్రిల్ 10న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on February 12, 2025 12:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

3 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

4 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 hours ago