ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాల ప్రీమియర్లకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ సమయానికి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటిల్లిపాది టీవీ సెట్ల ముందు తిష్ట వేసుకుని కూర్చునేవారు. దానికి తగ్గట్టే టిఆర్పి రేటింగ్స్ తో ఆదాయం భారీగా సమకూరేది. నిర్మాతలకు హక్కుల రూపంలో సొమ్ములు బాగా అందేవి.
ఓటిటిలు వచ్చాక సీన్ మారిపోయింది. శాటిలైట్ కన్నా ముందు తమ యాప్స్ లో స్ట్రీమింగ్ జరగాలనే కండీషన్ తో ప్రొడ్యూసర్లకు వల వేసి హక్కుల రూపంలో ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించడం మొదలయ్యింది. దీంతో టీవీ టెలికాస్ట్ కు ప్రాధాన్యం తగ్గిపోయి అందరూ ఓటిటిలకు షిఫ్ట్ అయిపోయారు.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ ట్రెండ్ మార్చేందుకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా శాటిలైట్, ఓటిటి హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా దీన్ని ముందు తమ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయబోతున్నారు. ఆ తర్వాత జీ5 లో పెట్టేస్తారు.
చాలా సంవత్సరాల తర్వాత ఇలా జరగడం విశేషం. మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని బుల్లితెరపై చూసేందుకు జనాలు ఎగబడతారని చెప్పడం సందేహం అక్కర్లేదు. థియేటర్లకే అంతగా పోటెత్తినప్పుడు టీవీలో వచ్చినప్పుడు ఇంట్లో చూడకుండా ఊరికే వదులుతారా. రచ్చ రచ్చ చేస్తారు.
ఇది బాగానే ఉంది కానీ అన్ని సినిమాలకు ఇలా జరిగే అవకాశం తక్కువే. ఎందుకంటే అధిక శాతం ఓటిటిలకు స్వంతంగా టెలికాస్ట్ ఛానల్స్ లేవు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ స్వతంత్రంగా వ్యాపారం చేసే డిజిటల్ కంపెనీలు. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఎన్ని ఈ బాటలో వెళ్తాయనేది చెప్పలేం.
రెండు హక్కులను గంపగుత్తగా ఒకరికే ఇచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. పాతిక రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ డీసెంట్ హోల్డ్ తో కొనసాగుతున్న ఈ బ్లాక్ బస్టర్ ఎప్పుడు ప్రసారమవుతుందనేది ఇంకా చెప్పలేదు కానీ ఫిబ్రవరి మూడో వారం లేదా శివరాత్రి పండక్కు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on February 10, 2025 3:21 pm
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి…
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన…
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…
ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…
ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో…