జూన్ ఒకటి నుంచి మల్లువుడ్ బంద్ కాబోతోంది. కేరళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నారు. షూటింగులు ఆపేస్తూ తమ డిమాండ్లు నెరవేరేవరకు అన్నీ ఆపేస్తున్నారు. తమ సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇంత కన్నా మార్గం లేదని వాపోతున్నారు.
సినిమా బడ్జెట్ లో 60 శాతం ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకు వెళ్ళిపోయి, 30 శాతం పన్ను కడుతూ అందులో మళ్ళీ అదనంగా ఎంటర్ టైన్మెంట్ టాక్స్ పేరుతో ఎక్కువ బాదుడుకు గురవుతున్నది తమ పరిశ్రమే అని చెబుతూ ఈ సమాఖ్య తరఫున హీరోయిన్ కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ పై విషయాలను వెల్లడించారు.
ఇప్పుడిది ఇతర భాషల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. మొత్తం ఆపేసినంత మాత్రాన హీరో హీరోయిన్లు దిగొచ్చి పారితోషికాలు తగ్గించుకుంటారా అంటే అనుమానమే. ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తున్నట్టు పన్ను తగ్గింపు చర్యలు అంత సులభంగా జరిగే పని కాదు.
జనవరి నెలలో కేవలం మలయాళం సినిమాల నుంచే వంద కోట్లకు పైగా నష్టం వచ్చిందనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట. యాభై రోజుల్లో తీయాల్సిన సినిమాను నూటా యాభై రోజులకు పొడిగిస్తున్న దర్శకుల ధోరణిని కూడా వీళ్ళు ఎండగడుతున్నారు. ఇతర భాషల పరిశ్రమల్లోనూ ఈ తరహా విప్లవం తెచ్చేందుకు మద్దతు కోరబోతున్నారని టాక్.
ఇవన్నీ ఎలా ఉంన్నా ముందైతే మార్పు రావాల్సింది నిర్మాతల్లోనే. ఒక హీరోకు హిట్టు పడగానే రెమ్యూనరేషన్లు అమాంతం పెంచేసి వాళ్ళ వెంట పడినప్పుడు సహజంగానే డిమాండ్ కు తగ్గట్టు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. వాళ్ళ గొంతెమ్మ కోరికలను మహాభాగ్యంగా భావించడం వల్లే కదా ఇవాళ చిన్న ఆర్టిస్టులు సైతం క్యారవాన్లు అడుగుతున్నారు.
నిర్మాణ వ్యయం కూడా అంతే. అదుపు తప్పుతున్నది కేవలం డైరెక్టర్ల వల్లే కాదు. అందులో అందరి బాధ్యత ఉంది. గత ఏడాది ఒక్క మల్లువుడ్ లోనే 176 సినిమాలు ఫ్లాపై నష్టాలు తెచ్చాయి. ఇప్పుడీ పరిణామాలకు ప్రధాన కారణం ఇదే.
This post was last modified on February 9, 2025 12:36 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…