Movie News

టాలీవుడ్‌కు డేంజర్ బెల్స్ : ఇంకెంత కాలం ఇలా..?

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజైన కొన్ని రోజులకు పైరసీ సీడీలు బయటికి వచ్చేవి. థియేటర్లలో స్క్రీన్‌ను రికార్డ్ చేసిన ఆ వీడియోల్లో క్లారిటీ ఉండేది కాదు. అయినా కొందరు వాటినే చూసేవాళ్లు. తర్వాతి రోజుల్లో పైరసీ రూపం మార్చుకుంటూ వస్తోంది. ఓటీటీల్లో సినిమాలు రిలీజయ్యాక వాటిని రికార్డ్ చేసి క్లారిటీ ప్రింట్లను అందుబాటులోకి తెస్తున్నారు.

అంతకంటే ముందు వచ్చే వచ్చే పైరసీ ప్రింట్లు పెద్దగా క్లారిటీ ఉండకపోవడంతో పైరసీ చూసే వాళ్లు తక్కువగానే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది. రిలీజ్ రోజు క్లారిటీ విజువల్స్, ఆడియోతో పైరసీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ రోజు హెచ్‌డీ ప్రింట్లు బయటికి రావడం ఇన్నాళ్లూ కోలీవుడ్లోనే చూసేవాళ్లం.

మూవీ రూల్జ్ లాంటి వెబ్ సైట్లు ఎలా చేస్తాయో ఏమో కానీ.. కొత్త చిత్రాలను రిలీజ్ రోజే మంచి క్లారిటీతో ఆన్ లైన్లోకి తెచ్చేస్తూ కోలీవుడ్‌ను చాలా ఏళ్ల నుంచి వేధించుకు తింటున్నాయి. ఐతే ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. క్రేజీ తెలుగు చిత్రాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఒకట్రెండు రోజుల్లోనే ఆన్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల విషయంలో ఇదే జరిగింది.

ఫుల్ క్లారిటీతో సినిమాలు ఆన్ లైన్లోకి రావడం వాటికి చేటు చేసింది. ఇప్పుడు ‘తండేల్’ కూడా పైరసీ బారిన పడింది. ఈ సినిమా నిన్ననే రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి టాక్ వచ్చిందని, వసూళ్లు కూడా బాగున్నాయని టీం అంతా సంబరాల్లో ఉండగా.. రాత్రికే వారి మీద పైరసీ బాంబు పడింది. మంచి క్లారిటీ విజువల్స్, సౌండుతో హెచ్‌డీ వెర్షన్‌‌ను ఆన్ లైన్లోకి వదిలేశారు.

విడుదలై ఒక్క రోజైనా గడవకముందే హెచ్‌డీ ప్రింట్లు ఆన్ లైన్లోకి వచ్చేస్తే ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి సినిమా తీసిన మేకర్స్ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైరసీని అరికట్టే విషయంలో కఠిన చర్యలు చేపట్టకపోతే మున్ముందు ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

This post was last modified on February 8, 2025 6:58 pm

Share

Recent Posts

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

7 seconds ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

20 minutes ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

42 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

3 hours ago