ఇటీవలే బాలకృష్ణ కల్ట్ మూవీ నారి నారి నడుమ మురారి టైటిల్ ని వాడేసుకున్న శర్వానంద్ తన మరో సినిమాకి పవన్ కళ్యాణ్ క్లాసిక్ టైటిల్ తీసుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు జానీ పేరుని దాదాపు ఖరారు చేసినట్టు వినికిడి.
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ఓకే అనుకుని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని సమాచారం. ఒకప్పుడు డిజాస్టర్ గా నిలిచిన జానీ తర్వాత క్రమంగా స్టేటస్ తెచ్చుకుంది. పవన్ దర్శకత్వ ప్రతిభకు మెచ్చుతునకగా విమర్శకులు మెచ్చుకుంటూ ఉంటారు.
ఒకవేళ జానీ కనక ఫిక్స్ అయితే శర్వాకో క్రేజీ పేరు దొరికినట్టే. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. మొదటి ప్రాధాన్యం నారి నడుమ మురారి కావడంతో దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు శర్వా.
పవన్ టైటిల్స్ ఇతర హీరోలు వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విజయ్ దేవరకొండ ఖుషి వచ్చేసింది. వరుణ్ తేజ్ ఎప్పుడో తొలిప్రేమని పెట్టేసుకున్నాడు. త్వరలో నితిన్ తమ్ముడుగా రాబోతున్నాడు. యాంకర్ ప్రదీప్ ఇదే ఏడాది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా త్వరలోనే వస్తున్నాడు. సుస్వాగతం కూడా ఎవరో తీసుకున్నారట.
వీటికి మాత్రం పవన్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. అకీరా నందన్ వచ్చేలోపు ఏదీ మిగలదని వాళ్ళ బాధ. నిజమే మరి. అందరూ పోటీపడి వాడేసుకుంటే పవర్ స్టార్ చేసిన ముప్పై లోపు సినిమాల్లో ఎన్ని మిగులుతాయని. కాకపోతే గబ్బర్ సింగ్ లాంటివి కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే బండ్ల గణేష్ దాన్ని షోలే నిర్మాతలకు సొమ్మిచ్చి మరీ కొనుక్కున్నాడు. అత్తారింటికి దారేది కూడా ఇప్పట్లో ఎవరూ వాడరు. సో అకీరాకు కొన్ని మిగిలే ఛాన్స్ లేకపోలేదు. అన్నట్టు శర్వానంద్ జానీలో తన తండ్రిగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నారట. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది. చూడాలి.
This post was last modified on February 8, 2025 9:18 am
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న…
నిన్న విడుదలైన తండేల్ కు పాజిటివ్ టాక్ రావడంలో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…