దాదాపు ఏడు నెలల నిరీక్షణకు ఇంకో రెండు రోజుల్లో తెరపడబోతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ఎంతగా అలరించిందో తెలిసిందే. అది రిలీజైన దగ్గర్నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మామూలుగా అయితే తారక్ పుట్టిన రోజైన మే 20న ఈ టీజర్ రావాల్సింది. కానీ కరోనా దెబ్బకు టీజర్‌కు విజువల్స్ తీసే అవకాశం లేకపోవడంతో జక్కన్న ఊరుకుండిపోయాడు.
చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. ముందు చెప్పినట్లే షూటింగ్ పున:ప్రారంభం కావడం ఆలస్యం.. టీజర్ కోసం అవసరమైన విజువల్స్ తీసేశాడు జక్కన్న. తర్వాత బ్రేక్ తీసుకుని ఆ టీజర్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.
ఈ నెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్‌డౌన్‌తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది. ఇక టీజర్‌లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్‌లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని చిత్ర బృందం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:28 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…