Movie News

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది. హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత తారక్, చరణ్ విదేశాలకు వెళ్లినా గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వారి రెఫరెన్సులు ఉంటున్నాయి.

తాజాగా ఫిఫా లాంటి అతి పెద్ద క్రీడా సంస్థ ఎన్టీఆర్‌ రెఫరెన్సుతో పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన ఫిఫా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న స్టార్ ఫుట్ బాలర్లు నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డోలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్యారికేచర్ వేయించడమే కాక.. ఆ ముగ్గురి పేర్లలో మొదటి ఇంగ్లిష్ అక్షరం తీసుకుని ‘NTR’ అనే కామెంట్ కూడా జోడించారు.

‘నాటు నాటు’ పాటను ప్రస్తావించడమే విశేషం అంటే.. అందులో చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా.. ముగ్గురు ఫుట్‌బాలర్ల పేర్లలోని మొదటి అక్షరాలతో కామెంట్ పెట్టడం మరింత ఆశ్చర్యం. ఇది తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. స్వయంగా తారక్ కూడా ఈ పోస్టు మీద స్పందించాడు.

పోస్టుపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందాయో.. తారక్, చరణ్‌లకు ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టాయో చెప్పడానికి ఈ పోస్టు తాజా ఉదాహరణ.

This post was last modified on February 5, 2025 5:26 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago