గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా కంటే ముందు ఈ జోడీ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే.. జాంబి రెడ్డి. తెలుగులో అరుదు అనదగ్గ జాంబీ జానర్‌కు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ జోడించి ప్రశాంత్ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
దీనికి కొనసాగింపుగా జాంబిరెడ్డి-2 తీస్తానని ప్రశాంత్ అప్పట్లోనే చెప్పాడు. కానీ తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఎట్టకేలకు ఇప్పుడు జాంబిరెడ్డి-2 అప్‌డేట్ వచ్చింది. అతి త్వరలోనే సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లోబోతోంది. ఐతే జాంబి రెడ్డి-2ను ప్రశాంత్ డైరెక్ట్ చేయట్లేదు. ఈ బాధ్యతలను బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మకు అప్పగించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో కొన్ని ఎపిసోడ్లను.. అలాగే రానా దగ్గుబాటి-విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన సుపర్ణ్ వర్మ.. ‘జాంబిరెడ్డి’ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు.
ఐతే ఈ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు షో రన్నర్‌గా ప్రశాంత్ వర్మే వ్యవహరించబోతున్నాడు. ‘హనుమాన్’తో తేజ సజ్జకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో బహు భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఊపు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం తేజ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ చివరి దశలో ఉంది. అది పూర్తి కాగానే ‘జాంబిరెడ్డి-2’ చిత్రీకరణలో పాల్గొంటాడు తేజ. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
This post was last modified on February 5, 2025 1:49 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…