పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల మార్చి 28 అని టీమ్ పదే పదే పలు మార్గాల్లో నొక్కి వక్కాణిస్తోంది కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఇప్పటికీ ఆ డేట్ పట్ల అనుమానంగానే ఉన్నాయి. ఇంకొద్ది రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడంతో ఫ్యాన్స్ లోనూ సందేహాలు లేకపోలేదు.
ఒకవేళ నిజంగా వీరమల్లు కనక మాట మీద నిలబడితే ఎవరికి లాభం ఎవరికి కష్టమో చూద్దాం. ముందుగా బెనిఫిట్ అయ్యేది నిర్మాత ఏఎం రత్నమే. ఎందుకంటే డిప్యూటీ సిఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమాగా ఫ్యాన్స్ ఇచ్చే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.
టాక్ కనక పాజిటివ్ వచ్చిందా వసూళ్ల సునామి ఖాయం. ఇదింకా పార్ట్ 1 కాబట్టి కంటెంట్ కనక బాగుంటే రెండో భాగానికి సరిపడా బిజినెస్ డిమాండ్ ఇప్పుడే ఏర్పడుతుంది. ఇది వర్కౌట్ కావాలంటే బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ రావాలి. తర్వాత ఏప్రిల్ లో ప్లాన్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ఒక పోటీ తగ్గింది కనక రిలాక్స్ అవుతాయి.
ఇక కష్టం విషయానికి వస్తే అదే డేట్ కి లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ ఇంకో ప్రత్యాన్మయం చూసుకోవాలి. మరుసటి రోజు షెడ్యూల్ చేసిన మ్యాడ్ స్క్వేర్ కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. నిర్మాత నాగవంశీ నేరుగా పవన్ కళ్యాణ్ తో క్లాష్ కి ఎట్టి పరిస్థితుల్లో సిద్దపడడు.
ఇక డబ్బింగ్ సినిమాలైన మోహన్ లాల్ ఎల్ 2 ఎంపురాన్, విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2 తెలుగు వెర్షన్లకు థియేటర్ల సమస్య వస్తుంది. ఆ రెండు టాలీవుడ్ మార్కెట్ మీద బోలెడు నమ్మకంతో మంచి రేట్లకు సినిమాలు అమ్ముకునే ప్లాన్ లో ఉన్నాయి. హరిహర వీరమల్లు కనక బరిలో ఉంటే దానికి ఎదురుగా నిలవడం అంత సులభం కాదు.
ఇవి కాకుండా సల్మాన్ ఖాన్ సికందర్ కూడా అదే వారం వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వీరమల్లుకి రివర్స్ లో హిందీ సైడ్ ఇబ్బందులుంటాయి. ఇలా ఒక తేదీ వెనుక ఇన్ని రకాల విశ్లేషణలు, లెక్కలు ఉన్నాయి. వీలైనంత త్వరగా టీమ్ మరోసారి అధికారిక ప్రకటన ఇస్తే బెటర్.
This post was last modified on February 4, 2025 5:40 pm
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…
వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు…
హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…
దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ ఏడాది జూన్ - జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్రమాలు,…
బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ…
ఇంకో మూడు రోజుల్లో తండేల్ విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్ద సినిమా ఇదే కావడంతో బయ్యర్ వర్గాలు…