టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు తిరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జరుగుతున్న యత్నాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు జరిగిన విచారణ సందర్భంగా మంచు వారు వాదులాటలకు దిగారట. ఫలితంగా ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి,. అంతేకాకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వచ్చారా?… లేదంటే వివాదాన్ని పెంచుకోవడానికి వచ్చారా? అంటూ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ హోదాలోని జిల్లా కలెక్టర్ మంచు వారిని మందలించారట. వెరసి ఈ వివాదానికి సోమవారం తెర పడుతుందని అంతా భావించినా… మరోమారు ఈ పంచాయతీపై విచారణ జరగనుంది.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్ పల్లి పరిధిలో మోహన్ బాబుకు ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ ఫామ్ హౌజ్ లో మోహన్ బాబు ఉండగా… ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన దాని నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ అందులో ఉంటున్నారు. అయితే ఆ ఫామ్ హౌజ్ తనదని, దానిని మనోజ్ కు ఇవ్వలేదని చెబుతున్న మోహన్ బాబు… అందులో నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని అదికారులను ఆశ్రయించారు.
మంచు ఫ్యామిలీలో రేగిన ఈ ఆస్తుల పేచీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కన్న తండ్రి అని కూడా చేడకుండా మోహన్ బాబుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన ఘటన పెను కలకలమే రేపింది. ఈ ఘటనతో మోహన్ బాబు పలు చిక్కులు ఎదుర్కొన్నారు కూడా. అయితే ఎలాగోలా నెట్టుకువచ్చిన మోహన్ బాబు…మనోజ్ ను తన ఇంటి నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్… మనోజ్ ను ఇదివరకే ఓ దఫా విచారించారు. తాజాగా సోమవారం మనోజ్ తో పాటు మోహన్ బాబును కూడా కలెక్టర్ విచారణకు పిలిచారు. కలెక్టర్ ఆదేశాలతో మోహన్ బాబు, మనోజ్… ఇద్దరూ సోమవారం మధ్యాహ్నం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. వీరిద్దరినీ కలెక్టర్ దాదాపుగా రెండు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలెక్టర్ ముందే వాదులాటకు దిగారట. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. వివాద పరిష్కారం కోసం వచ్చారా?… లేదంటే వాదులాటకు వచ్చారా? అని మందలించారట. అంతేకాకుండా అప్పటికప్పుడు విచారణను ముగించిన కలెక్టర్… వచ్చే వారం మరోమారు విచారణకు రావాలని ఆదేశించారట. ఈ సారి అయినా వివాద పరిష్కారానికి సిద్ధపడి రావాలని కలెక్టర్ వారికి సూచించారట.
This post was last modified on February 3, 2025 7:07 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…