Movie News

ఓటీటీలో మార్కో… ఇంకా ఎక్కువ డోస్

మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని రూపొందించిన తొలి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్ ఆ చిత్రం వంద కోట్ల క్లబ్బులోనూ అడుగు పటె్టింది. మోహన్ లాల్ మూవీ ‘బరోజ్’ పోటీలో ఉన్నా.. దాన్ని తొక్కి పడేసి ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది.

వారం తర్వాత ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తొలి రోజు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘మార్కో’ రికార్డు నెలకొల్పింది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ ఓవరాల్‌గా మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే ఇక్కడ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మరీ టూమచ్ వయొలెన్స్ ఉండడం.. కొన్ని సన్నివేశాలు భరించలేని విధంగా ఉండడంతో సమీక్షకులందరూ హెచ్చరికలు జారీ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో వామ్మో వాయ్యో అన్నారు.

యానిమల్, కిల్ లాంటి మోస్ట్ వయొలెంట్ సినిమాలు చూసి మెచ్చిన వాళ్లు కూడా.. దీని ముందు ఆ మూవీస్ దిగదుడుపే ఉన్నారు. ఐతే థియేటర్లలో చూసిన ఆ వయొలెన్సే తట్టుకోలేని విధంగా ఉంటే.. ఇప్పుడు ‘మార్కో’ డోస్ ఇంకా పెరగబోతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. థియేట్రికల్ కట్ విషయంలో కొన్ని సన్నివేశాల పట్ల సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టడంతో కోత పెట్టేశామని, వాటిని ఓటీటీ వెర్షన్లో జోడిస్తామని హీరో ఉన్ని ముకుందన్ ముందే చెప్పాడు.

ఇప్పుడు ఆ ప్రకారమే మరింత వయొలెంట్ సీన్లతో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. వయొలెంట్ మూవీస్‌ను ఇష్టపడేవారు కూడా థియేటర్లలో ‘మార్కో’ను చూసి తట్టుకోలేకపోయారు. చిన్న పిల్లల్ని, ఆడవాళ్లను తీవ్రంగా హింసించి చంపడం.. గర్భిణి కడుపులోంచి బిడ్డను బయటికి లాగడం.. తర్వాత ఆమె నోట్లో కత్తి దించి దారుణాతి దారుణంగా హత్య చేయడం లాంటి సీన్లకు బెంబేలెత్తిపోయిన జనాలు..

ఇంతకుమించిన వయొలెంట్ సీన్లను ఓటీటీలో చూసి ఏమైపోతారో? పిల్లలు, మహిళలు, సున్నిత మనస్కులు పొరపాటున కూడా ఈ సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో ఒక క్యాంపైనింగ్ నడపాల్సిన అవసరం ఉందని నెటిజన్లు విభిన్న భావాలు వ్యక్తపరుస్తున్నారు.

This post was last modified on February 3, 2025 6:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే…

27 minutes ago

రానా నాయుడు 2 – భలే టైమింగ్ దొరికిందే

విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…

1 hour ago

ఫస్ట్ ఛాయిస్ అవుతున్న సందీప్ కిషన్

ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…

1 hour ago

మహా ‘ఆనందం’గా ఉన్న బ్రహ్మానందం

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…

2 hours ago

కీర్తి సురేష్ ‘అక్క’ ఆషామాషీగా ఉండదు

బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…

2 hours ago

పెమ్మసాని ఎత్తులకు అంబటి చిత్తు

అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…

3 hours ago