బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది. డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడంటే సెట్స్ మీద ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ లో పెట్టేశాడు కానీ ఫ్యాన్స్ కోసం ఒక వెరైటీ ఐడియాని రీ రిలీజ్ రూపంలో తీసుకొస్తున్నాడు.
2020 లో డైరెక్ట్ ఓటిటి ద్వారా రిలీజైన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. నేరుగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ యూత్ ఎంటర్ టైనర్ కి యూత్ లో భారీ స్పందన దక్కింది. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతకు పైసా వసూల్ అనిపించాయి.
ఆ టైంలో బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వాళ్ళ కోసం కృష్ణ అండ్ హిజ్ లీలని థియేట్రికల్ గా కొత్త పేరుతో రీ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో. అంటే టైటిల్ ఇదే ఉండబోతోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా సమర్పకుడిగా వ్యవహరించిన దగ్గుబాటి రానా దీని బాధ్యతలను తీసుకున్నాడు.
ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయబోతున్నారు. చిన్న ప్రోమో వదిలారు. చూస్తుంటే సినిమాలో మిస్ అయిన సీన్లు, ఫుటేజ్ ఇప్పుడీ కొత్త వెర్షన్ లో చూసే ఛాన్స్ దక్కొచ్చు. శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన ఇట్స్ కాంప్లికేటెడ్ మంచి టైం కొట్టేసింది.
ఎందుకంటే లవర్స్ డే రోజు విడుదల ప్లాన్ చేసుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబా, విశ్వక్ సేన్ లైలా రెండు వాయిదా దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇవాళో రేపో అధికారిక ప్రకటనలు రావొచ్చు. అదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర స్పేస్ దొరుకుతుంది. రామ్ చరణ్ ఆరంజ్ వస్తోంది కానీ ఆల్రెడీ దీన్ని థియేటర్లో చూసిన జనాలు సిద్ధూ వైపు మొగ్గు చూపొచ్చు.
సిద్దార్థ్ ఓయ్ కూడా ఆల్రెడీ చూసేసిన బాపతే. గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న అతిథిని వేసవికి షిఫ్ట్ చేశారు. సో ప్రేమికులు సరదాగా సమయం గడపాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ మంచి ఆప్షన్ కావొచ్చు. అన్నట్టు ఇదే హీరో డైరెక్టర్ కాంబోలో రానా మరో సినిమా తీయబోతున్నాడు.
This post was last modified on February 3, 2025 11:32 am
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…