తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా ఎవరికి తెలియని, చెప్పని ఒక సంఘటన పంచుకున్నారు. తన మొదటి సినిమా క్యాస్టింగ్ టైంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకున్నారు. అర్జున్ రెడ్డికి కి హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో ప్రేమమ్ సందీప్ వంగా మనసులో ఉండిపోయింది.
కేరళ నుంచి సాయిపల్లవి కో ఆర్డినేటర్ గా చెప్పుకున్న ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ సంపాదించి ఆయన్ని సంప్రదించాడు. తన మూవీ విపరీత ప్రవర్తన కలిగిన భగ్న ప్రేమికుడిదని, రొమాంటిక్ టచ్ కూడా ఉంటుందని చూచాయగా చెప్పాడు.
దీంతో అవతలి వ్యక్తి సమాధానం చెబుతూ రొమాన్స్ సంగతి తర్వాత, అసలు సాయిపల్లవి స్లీవ్ లెస్ కూడా వేసుకోదు కాబట్టి ఇంకా సంగతి మర్చిపొమ్మని చెప్పాడు. తర్వాత అతగాడు అసలు ఆమె మేనేజర్ కాదని తెలియడం వేరే విషయం. దీంతో సందీప్ వంగా ఆలోచన మానుకుని షాలిని పాండేకు షిఫ్ట్ అయ్యాడు.
అయితే హిట్లు పెరిగే కొద్దీ హీరోయిన్లు కొన్ని మొహమాటాలు వదిలేయడం సహజం. కానీ సాయిపల్లవి మాత్రం అలాగే కట్టుబడి ఇప్పుడూ అదే సూత్రాన్ని పాటించడం సందీప్ వంగాను అభిమానిగా మార్చింది. ఇదంతా స్వయంగా తండేల్ స్టేజి మీద షేర్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తర్వాత సాయిపల్లవి స్పందిస్తూ తన స్పీచ్ లో సందీప్ రెడ్డి వంగా ఫ్యాషనేట్ ఫిలిం మేకర్ ఎదిగిన వైనాన్ని మెచ్చుకుంటూ తనకు మేనేజర్ ఎవరూ లేరని, ఎవరితో మాట్లాడినా అర్జున్ రెడ్డిని రాసిపెట్టిన వాళ్లే చేశారని, షాలిని విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించి గొప్పగా జీవించారని కితాబిచ్చింది.
అందుకే ఇంత స్వీట్ మెమరీని షేర్ చేసుకున్న సందీప్ వంగాకు కృతజ్ఞతలు చెప్పింది. మొత్తానికి మోడరన్ కల్ట్ ఫిలిం మేకర్, కల్ట్ క్లాసీ హీరోయిన్ మధ్య జరిగిన ఈ తీయని సంభాషణ తండేల్ వేడుక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. ఏమైనా అర్జున్ రెడ్డి ఫస్ట్ ఛాయస్ సాయిపల్లవి అనే మాట ఎంత బాగుందో కదూ.
This post was last modified on February 3, 2025 10:40 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…