ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా ఫుటేజ్ దాకా ప్రతిదీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. కానీ ఒకప్పుడు ఇలా లేదు. ఫిలిం నెగటివ్ ని వాడేవారు. అంటే నలుపు రంగులో పొడవైన రీలుకు రెండువైపులా రంధ్రాలు చేసిన ఉన్న ఒక స్ట్రిప్ ని కెమెరాలో లోడ్ చేసి వాడేవారు.
కాకపోతే ఇది ఖరీదైన వ్యవహారం. ఒకవేళ ఏదైనా రీటేక్ చేయాలంటే కొత్త రీల్ అప్లోడ్ చేయాలి. ముందు తీసింది వృథా అయినట్టే. దీని వల్ల నిర్మాతలకు బోలెడు వ్యయ ప్రయాసలు ఉంటాయి. అందువల్లే దర్శకులు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని షాట్ తీసేవారు.
కొత్త యుగంలో ఆ సమస్య లేదు. డిజిటల్ కాబట్టి వేస్టేజ్ సమస్య లేదు. ఎన్నిసార్లు తీసినా ఖర్చు లేని డిలీట్ ఆప్షన్ వాడుకోవచ్చు. అందుకే టెక్నాలజీ మార్పు ఎన్నో రకాలుగా దోహదం చేసింది. అయితే రామ్ చరణ్ 16 సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడబోతున్నారట.
ఎందుకంటే ఇలా షూట్ చేసిన భాగాలు సహజమైన రంగులతో ఒరిజినల్ గా ఉంటాయి. ఆర్గానిక్ అనిపిస్తాయి. అతిగా కలర్ ఎక్స్ పోజ్ కావడం లాంటివి ఉండవు. పైగా మాస్టర్ నెగటివ్ ఉంటే రీ మాస్టరింగ్ చేసుకోవడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. ఈ మధ్య పాత రీ రిలీజులను ఇలాగే చేశారు.
ఆర్సి 16 జరిగే కాలం ముప్పై నలభై సంవత్సరాల వెనుక కాబట్టి నెగటివ్ తో ప్రయోగం చేయాలనేది రత్నవేలు ఆలోచన. సుప్రసిద్ధ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటికీ దీన్నే వాడుతుంటారు. ఓపెన్ హెయిమర్ మొత్తాన్ని అలాగే షూట్ చేసి నెగటివ్ రీల్స్ అన్నీ భద్రపరిచారు.
దీనికి చాలా ఖర్చయినా సరే వెనుకడుగు వేయలేదు. ఒకవేళ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆ భాగం కానక వర్కౌట్ అయితే మిగిలిన వాళ్ళు ఈ దారిలో వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కాకపోతే నెగటివ్ ఫిలిం అంత సులభంగా దొరకదు. వాడకం తగ్గింది కాబట్టి కంపెనీలు ఉత్పత్తి చేయడంలో కోత విధించాయి. మళ్ళీ పుంజుకోకపోవచ్చు.
This post was last modified on February 1, 2025 5:38 pm
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…
వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…