బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో చేసిన రెండు డిజాస్టర్ కావడం కాకతాళీయమే అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఫలితాల పట్ల కలవరపడుతున్నారు. వినయ విధేయ రామ కనీసం కమర్షియల్ గా పే చేసింది.
ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. టీవీలో వచ్చిన చాలాసార్లు టిఆర్పి రేటింగ్ భారీగా వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ దానికి నోచుకునేలా లేదు. సౌత్ ఇండియా మూవీస్ ని ఆచితూచి ఎంచుకుంటున్న కియారా ప్రస్తుతం యష్ టాక్సిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత కీలకం పూర్తి చేసి షూటింగ్ వేగవంతం చేశారు.
కానీ కియారా పెర్ఫార్మన్స్ పట్ల యష్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల హీరోయిన్ మార్పు ఉండొచ్చనే ప్రచారం బెంగళూరు వర్గాల్లో జోరుగా ఉంది. నిజానికీ అమ్మడికి నటన పరంగా ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు మన సైడ్ దక్కలేదు. కేవలం హీరోని ప్రేమించి డ్యూయెట్లలో డాన్సులు చేయడానికి తప్పించి వేరేదానికి వాడుకోలేదు.
కానీ టాక్సిక్ అలా లేదట. కథానాయకిని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దరాట. ఆ రషెస్ చూశాకే యష్ వద్దని చెప్పాడని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ ఇప్పటిదాకా అయితే ఆమెనే చిత్రీకరణలో పాల్గొంటోంది.
ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రమోషన్లలో పాల్గొనకుండా దూరంగా ఉన్న కియారా కనీసం ఒక తెలుగు ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కు వెళ్ళలేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన కారణంగా హిందీ బిగ్ బాస్ కు వెళ్ళింది. కానీ హైదరాబాద్ వచ్చి కనీసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
అసలు ముంబై నుంచి బయటికి వస్తేగా ఏదైనా భాగమవ్వడానికి. ప్యాన్ ఇండియా మూవీకి కియారా ఇలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆక్షేపించారు. సరే జరిగిందేదో జరిగింది కానీ టాక్సిక్ విషయంలో దర్శక నిర్మాతలు ఏదో ఒకటి అధికారిక ప్రకటన ఇవ్వడం బెటర్.
This post was last modified on February 1, 2025 4:00 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…