ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా బాబీ కొల్లి పేరు చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అతను సూపర్ హిట్ కొట్టాడు. రెండేళ్ల కిందట ‘వాల్తేరు వీరయ్య’తో బాబీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన కెరీర్లో ఒక్క ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మినహా అన్నీ సక్సెస్ ఫుల్ సినిమాలే. ఇప్పుడీ స్థాయిలో ఉన్న బాబీ.. ఒకప్పుడు సినీ రంగంలోకి అడుగు పెట్టినపుడు అందరిలాగా ఇబ్బంది పడ్డవాడే.
కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆ సమయంలోనే బాబీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రముఖ చెస్ ప్లేయర్ హారిక సోదరి అయిన అనూష.. బాబీ ఘోస్ట్ రైటర్‌గా ఉన్న టైంలోనే అతణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పదనం గురించి బాబీ మాట్లాడాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..‘‘నేను అదృష్టంగా ఫీలయ్యేది నా పెళ్లి విషయం.
తన భర్త ఎలాంటి సినిమాలు తీస్తాడో.. ఏం చేస్తాడో తను సీరియస్‌గా తీసుకోదు. స్కూల్ డేస్‌లోనే నేను తనను ప్రేమించాను. అది ఆకర్షణా అంటే చెప్పలేను. వాటర్ బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైంది మా స్నేహం. అక్కడ్నుంచి ఇద్దరం హైదరాబాద్ వచ్చేశాం. తను ఇంజినీరింగ్ చదివింది. గోల్డ్ మెడలిస్ట్. తర్వాత వేలూరులో ఎంటెక్ చదివింది. అక్కడా గోల్డ్ మెడలిస్టే. కానీ తను అంత చదువరి అయినా.. ఏమీ లేని బాబీని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
వాళ్లది పెద్ద ఫ్యామిలీ అయినా.. అనూష నన్ను ప్రేమించిందని, ఎవరేమనుకున్నా పర్వాలేదని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ కాదు. కనీసం రైటర్‌గా నాకు సోలో కార్డ్ కూడా పడలేదు. ఘోస్ట్ రైటర్‌నే. అయినా అందరూ నన్ను నమ్మారు. అది నా అదృష్టం అనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా మా కష్టాలు మేమే పడ్డాం. హారిక మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నా మా కష్టం మేమే పడాలి అనుకున్నాం.
రెంట్ కట్టుకుంటూ.. ఈఎంఐలు కట్టుకుంటూ.. అవకాశాలు వెతుక్కుంటూ.. మొదలైన మా జర్నీ.. ఈ రోజు ఇండస్ట్రీలో నాకంటూ ఒక పొజిషన్ వచ్చేలా చేసింది. తను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. సింపుల్‌గానే బతుకుతుంది. నేనో స్టార్ డైరెక్టర్ భార్యని అని చెప్పుకోదు. పాపను స్కూటీలో తీసుకెళ్లి స్కూల్‌లో దింపుతుంది’’ అంటూ బాబీ తన భార్య మీద ప్రశంసలు కురిపించాడు.
This post was last modified on January 31, 2025 4:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…