Movie News

కార్తికేయ-3.. వేరే లెవెల్ : చందూ

పదేళ్ల కిందట ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తన ప్రతిభను చాటాడు. తర్వాత తన నుంచి వచ్చిన ‘ప్రేమమ్‌’ ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ మీద అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్‌తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది.

చందూ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం తన నుంచి రాబోతున్న ‘తండేల్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తర్వాత అతను కార్తికేయ-3 తీస్తానంటున్నాడు. ‘కార్తికేయ-2’ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దీనికి హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సినిమా మొదలు కాకముందే ఆ హైప్‌ను ఇంకా పెంచేలా దాని గురించి కొన్ని విశేషాలు చెప్పాడు చందూ ఒక ఇంటర్వ్యూలో.

కార్తికేయ-3 వేరే స్థాయిలో ఉంటుందని చందూ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘కార్తికేయ-3 కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. ఆ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. కార్తికేయ-2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్‌ను ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తి పూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. కార్తికేయ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది.

నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకునేవాడిని. కార్తికేయ-2 చూశాక చాలామంది పిల్లలు కృష్ణుడి గురించి పెదవాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసి సంతోషించాను. చాలామంది తల్లిదండ్రులు నన్ను కలిసినపుడు తమ పిల్లలు గోవర్ధన గిరి గురించి అడుగుతున్నారని చెప్పారు. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా’’ అని చందూ తెలిపాడు.

This post was last modified on January 31, 2025 4:29 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago