ఈసారి సంక్రాంతికి కేవలం ఆరు నెలల సమయం ఉండగా మొదలైన చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. మేకింగ్ దశలో దీని గురించి పెద్దగా చర్చే లేదు. కానీ రిలీజ్ టైంకి ఫుల్ పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అయినా సరే.. రేంజ్ పరంగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్‌ల తర్వాతి స్థానంలోనే దీన్ని నిలబెట్టారు ట్రేడ్ పండిట్లు. కానీ రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. మిగతా రెండు చిత్రాలను వెనక్కి నెట్టేసి రేసులో దూసుకెళ్లిపోయింది.
ఫ్యామిలీ సినిమాలకు ఉండే పరిమితులన్నింటినీ విసిరికొట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అద్భుతాలు చేసింది. కేవలం 55 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన రీజనల్ మూవీ.. థియేటర్ల నుంచే రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలో మరెన్నో రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీ ఇదే. ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉన్న గ్రాస్, షేర్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది.
ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడో వీకెండ్లోకి అడుగు పెడుతోంది. అయినా ఈ శని, ఆదివారాల్లో సినిమా చాలా స్ట్రాంగ్‌గా నిలబడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటిదాకా ఆ యాప్‌లో ఈ సినిమా టికెట్ల 33 లక్షలు అమ్ముడవడం విశేషం. ఇప్పటిదాకా ఏ రీజనల్ తెలుగు మూవీకీ బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడవలేదు.
ఇతర టికెట్ బుకింగ్ యాప్స్ కూడా కలిపితే లెక్క చాలా పెద్దగానే ఉంటుంది. దీనికి తోడు వాకిన్స్ ఉండనే ఉన్నాయి. మొత్తంగా ఫుట్ ఫాల్స్ విషయంలో భారీ చిత్రాలకు దీటుగా నిలుస్తోంది ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం.. ఇలా అన్నీ కలిసి వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. వచ్చే శుక్రవారం ‘తండేల్’ వచ్చే వరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ జోరు కొనసాగబోతోంది.
This post was last modified on January 31, 2025 12:23 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…