సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా సినిమా వేడుకకు వచ్చినా.. ఇంటర్వ్యూలో పాల్గొన్నా చాలా డీసెంట్‌గా కనిపిస్తాడు. కానీ ఆయనతో దగ్గరగా గడిపిన వాళ్లు మాత్రం మహేష్ కామెడీ టైమింగే వేరని.. తన అల్లరి మామూలుగా ఉండదని అంటుంటారు. ఇక మహేష్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడని తన సోదరి మంజుల చెబుతూ ఉంటుంది. ఐతే చదువుకునే రోజుల్లో మహేష్ అల్లరి ఏ స్థాయిలో ఉండేదో ఇప్పుడు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
చెన్నైలో తాను, మహేష్ కలిసి చదువుకున్న విషయాన్ని అతను వెల్లడించాడు. విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ఓ తమిళ చిత్రం ‘ప్రేమిస్తావా’ పేరుతో రిలీజవుతున్న నేపథ్యంలో తెలుగు మీడియాకు అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా స్కూల్ డేస్‌లో మహేష్‌తో కలిసి తాను వేసిన అల్లరి వేషాల గురించి అతను వెల్లడించాడు.
ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో.. మహేష్ ఏమనుకుంటాడో అంటూనే.. పరీక్షల్లో పాస్ కావడం కోసం తాను, మహేష్ కలిసి క్వశ్చన్ పేపర్లు కొనేవాళ్లమని విష్ణువర్ధన్ తెలిపాడు. ఎవరో క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారని చెబితే.. మహేష్ బైక్ వేసుకుని వచ్చేవాడని.. ఇద్దరం వెళ్లి డబ్బులు పెట్టి పేపర్లు కొనేవాళ్లమని అతను తెలిపాడు.
ఐతే నిజానికి అవి ఫేక్ కశ్చన్ పేపర్లు అని.. తాము మోసపోయామని తర్వాత అర్థం అయ్యేదని.. వాటిని నమ్ముకుని తాను ఫెయిలయ్యేవాడినని.. కానీ మహేష్ మాత్రం ఎలాగో పాస్ అయిపోయేవాడని చెబుతూ విష్ణువర్ధన్ గట్టిగా నవ్వేశాడు. అతను మహేష్ గురించి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు డీసెంట్‌గా కనిపించే చాలామంది స్కూల్, కాలేజ్ డేస్‌లో అల్లరి వాళ్లే అయ్యుంటారు. అందుకు మహేష్ కూడా మినహాయింపు కాదని.. విష్ణువర్ధన్ ఇంటర్వ్యూలతో స్పష్టమైంది. ఈ విషయమై భవిష్యత్తులో ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు మహేష్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
This post was last modified on January 31, 2025 12:18 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…