స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అంటే.. షూటింగ్ స్పాట్లో, బయట ఈవెంట్లకు హాజరైనపుడు ఉండే హడావుడే వేరు. షూటింగ్ అంటే.. ఆ హీరోయిన్‌తో పాటు అరడజనుమందికి తక్కువ కాకుండా స్టాఫ్ వస్తారు. మేకప్ కోసం ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. హీరోయిన్‌కు ఒక కారవాన్ ఇవ్వాలి. తనతో పాటు స్టాఫ్‌కు బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి. స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేయాలి. ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి.
కొందరు హీరోయిన్లు ఈ సౌకర్యాల్లో కొన్ని మినహాయింపులు ఇస్తారు కానీ.. చాలావరకు స్టార్ కథానాయికలు అంటే ఈ హడావుడి ఉండాల్సిందే. కానీ సాయిపల్లవి మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె ఎంత సింపుల్‌గా ఉంటుందో చాలా సందర్భాల్లో అందరూ చూశారు. ఇప్పుడు తనతో ‘తండేల్’ సినిమా చేసిన దర్శకుడు చందూ మొండేటి మాటలు వింటే సాయిపల్లవి అందరూ అనుకునేదానికంటే చాలా సింపుల్ అని.. ఈ రోజుల్లో తనలా ఇంకే హీరోయిన్ ఉండలేదని అర్థమవుతుంది.
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి గురించి చందూ మాట్లాడుతూ.. ‘‘తనంత సింపుల్ హీరోయిన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. వేరే హీరోయిన్ల మాదిరి తనతో పాటు స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. ఒక్కతే షూట్‌కు వచ్చేస్తుంది. వెంట మేకప్ కిట్లు లాంటివేమీ తెచ్చుకోదు. షూట్‌లో కూడా మేకప్‌కు చాలా వరకు దూరంగానే ఉంటుంది. జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తుంది. షూట్‌లో ఎంత ఇబ్బంది ఎదురైనా తట్టుకుంటుంది.
‘తండేల్’ కోసం సముద్రం మీద, ఒడ్డున ప్రమాదకరమైన సీన్లు తీశాం. ఎవ్వరి సాయం లేకుండా తన పని తాను చేసుకుంటుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ అంటే నడుచుకుంటూ వచ్చేస్తుంది. మా సినిమాలో ఎక్కువ సీన్లు సముద్రం నేపథ్యంలో ఎండలో తీయడం వల్ల ఆమెకు ట్యాన్ వచ్చేసింది. దీంతో ఆమె చేస్తున్న మరో సినిమా ‘రామాయణం’ టీం వాళ్లు లబోదిబోమన్నారు.
రామాయణం, అమరన్ లాంటి సినిమాల్లో నటిస్తూ కూడా ఎంతో ఓపిగ్గా మా సినిమా చిత్రీకరణలో పాల్గొంది. ఆమె గొప్ప నటి అని నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సినిమా టైంలో ఆమె వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను’’ అని చందూ చెప్పాడు.
This post was last modified on January 30, 2025 7:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…