అంతా అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ ఈపాటికే రిలీజ్ అయిపోయి ఉండాలి. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లినపుడే 2025 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. మేకింగ్ చివరి దశకు వచ్చినపుడు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. కానీ మూడు నెలల కిందట టీజర్ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. ఆ టీజర్లో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడం.. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరగడంతో చిత్ర బృందం పునరాలోచనలో పడింది.
సినిమాను అలాగే రిలీజ్ చేస్తే ‘ఆదిపురుష్’ ఫలితమే ఎదురవుతుందని భయపడింది. అందుకే వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టారు. ముందున్న సంస్థను తప్పించి.. వేరే సంస్థతో మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుండడంతో ఆలస్యం అనివార్యమైంది. సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా ఏ అధికారిక అప్‌డేట్ లేదు. కాగా ‘విశ్వంభర’కు సంబంధించి ఇప్పుడో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని.. విజువల్ ఎఫెక్ట్స్ పనులను పర్యవేక్షిస్తున్నాడని ఒక ఊహాగానం మొదలైంది. ‘కల్కి’ మూవీలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా వీఎఫెక్స్ ఔట్ పుట్ రాబట్టిన నేపథ్యంలో నాగికి కొంత కాలం పాటు ఈ పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారని ప్రచారం నడుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు. కానీ ఈ ప్రచారం నిజం కాదని తెలుస్తోంది.
నాగి ‘కల్కి-2’ పనుల్లోనే బిజీగా ఉన్నాడట. ‘విశ్వంభర’ కోసం టైం పెట్టే పరిస్థితిలో లేడట. ‘విశ్వంభర’ టీం సైతం నాగిని సంప్రదించడం లాంటిదేమీ చేయలేదని సమాచారం. ముందున్న వీఎఫెక్స్ కంపెనీని తప్పించారు. దాని స్థానంలో సరైన టీంను తీసుకున్నారట. బహుశా ఈ విషయంలో నాగి నుంచో.. రాజమౌళి నుంచో సలహాలు అయితే తీసుకుని ఉండొచ్చు. రెఫరెన్సులు అడిగి ఉండొచ్చు.
అంతే తప్ప మరో దర్శకుడికి వీఎఫెక్స్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే లేదని సమాచారం. అన్నీ అనుకూలిస్తే చిరుకు ఎంతో కలిసి వచ్చిన మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on January 30, 2025 1:19 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…