సంక్రాంతి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిపోయి సీనియర్ హీరోల్లో టాప్ కలెక్షన్ మైలురాయి సొంతం చేసుకున్న వెంకటేష్ ఆనందం అంతా ఇంతా కాదు. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో సైంధవ్ చేసిన గాయం అంతా ఇంతా కాదు. మరీ దారుణంగా డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ఊర మాస్ స్టయిలిష్ గెటప్ లో వెంకీ అదరగొడతాడనుకుంటే ఎమోషన్ యాక్షన్ మధ్యలో నలిగిపోయి నిరాశ పరిచాడు. అందుకే ఎప్పుడెప్పుడు కంబ్యాక్ అవుతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళ నిరీక్షణ ఇన్నేళ్ల తర్వాత ఫలించింది. అసలు సవాల్ ఇప్పుడుంది.
ఇంత పెద్ద సక్సెస్ సాధించాక వెంకటేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తారనేది పెద్ద ప్రశ్న. సంక్రాంతికి వస్తున్నాంకు కొన్ని నెలల ముందే సామజవరగమన లాంటి హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన నందు ఒక లైన్ చెప్పి ఒప్పించాడు. అయితే ఫైనల్ నెరేషన్ అవ్వకపోవడంతో అనౌన్స్ మెంట్ రాలేదు.
ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. వెంకీతో పాటు సురేష్ బాబు కూడా కథలను జాగ్రత్తగా వడబోస్తారు. సో స్క్రిప్ట్ ని జాగ్రత్తగా రాసుకుని వెళ్ళాలి. నందు కో రైటర్ భాను భోగవరపు ఇప్పటికే రవితేజ మాస్ జాతరతో తెరంగేట్రంకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు నందుది ఓకే కావడమే ఆలస్యం.
ఒకవేళ ఇది ఆలస్యమైతే వెంకటేష్ నెక్స్ట్ ఏంటనేది ఇంకో ప్రశ్న. వెంకీ అట్లూరి లాంటి వాంటెడ్ డైరెక్టర్స్ నుంచి వద్దనుకునే రామ్ గోపాల్ వర్మ దాకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరికీ ఖచ్చితమైన కమిట్ మెంట్ అయితే ఇవ్వలేదు. నిజానికి ఇప్పటికిప్పుడు సంక్రాంతికి వస్తున్నాం 2 తీస్తానని అనిల్ రావిపూడి అంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు.
కానీ అవతల చిరంజీవితో సినిమా ఖరారయ్యింది కాబట్టి రావిపూడి ఇంకొన్ని నెలల పాటు బిజీ అయిపోతాడు. పేరు ఎవరిది ఫైనల్ అయినా వెంకటేష్ మాత్రం ఇకపై పూర్తి వినోదాత్మక చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
This post was last modified on January 30, 2025 9:45 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…