Movie News

మళ్లీ దొరికిపోయిన కంగనా

లాక్ డౌన్ టైంలో ఇండియాలో సోనూ సూద్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఫిలిం సెలబ్రెటీ అంటే కంగనా రనౌత్ అనే చెప్పాలి. కాకపోతే సోనూలా మంచి పనులతో ఆమె వార్తల్లో నిలవలేదు. అనేక వివాదాలతోనే ఆమె ‘న్యూస్’గా మారింది. తాను ఎదిగిన ఇండస్ట్రీ మీదే ఆమె అనేక ఆరోపణలు చేస్తోంది ఈ మధ్య.

తనకంటూ ఒక గుర్తింపు లేని సమయంలో అందరిలో ఒకరిలా ఉన్న కంగనా.. ఇప్పుడు మాత్రం తాను వేరు అన్నట్లు వ్యవహరిస్తోంది. కొందరిని అదే పనిగా టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పిస్తోంది. ఐతే ఈ క్రమంలో ఆమె కొన్నిసార్లు శ్రుతిమించిపోతుండటంతోనే సమస్య వస్తోంది. తాను చేసిన తప్పుల్ని కప్పి పుచ్చేసి అవతలి వాళ్లను నిందించాలని చూడటంతో కంగనా తరచుగా సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది.

ఈ మధ్య కంగనా బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి ఎన్నో ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ మయం అయిపోయిందని అంది. చాలామంది మీద ఆరోపణలు చేసింది. తాను మాత్రం ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. అలా అని ఎవరైనా నిరూపించాలని ఆమె సవాల్ చేసింది కూడా. కట్ చేస్తే.. గతంలో ఒక సందర్భంలో తాను డ్రగ్స్‌కు బానిస అయ్యానని, తర్వాత దాన్నుంచి బయటపడ్డానని స్వయంగా కంగనానే చెప్పిన వీడియో బయటికి రావడంతో ఆమె గాలి తీసేసినట్లయింది. ఇక అక్కడి నుంచి డ్రగ్స్ గురించి మాట్లాడట్లేదామె.

తాజాగా కంగనా మరోసారి డబుల్ స్టాండర్డ్ కామెంట్‌తో నెటిజన్లకు దొరికిపోయింది. కొత్తగా హిందుత్వ ముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఉన్న కంగనా.. ‘పీకే’ సినిమాలో హిందూ దేవుడిని కించపరిచేలా ఉన్న ఒక సన్నివేశం తాలూకు ఫొటో పెట్టి ఇలా మరో మతానికి చెందిన దేవుడిని సినిమాలో చూపిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్న బాగానే ఉంది కానీ.. ఇప్పుడిలా అంటున్న కంగనా, ఒకప్పుడు ‘పీకే’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొంది. కానీ అప్పుడు ఆమె ఆ సినిమాలోని సన్నివేశాల గురించి ఎందుకు అభ్యంతర పెట్టలేదు, ఎలా ఆ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి కంగనా దగ్గర సమాధానం లేకపోయింది.

This post was last modified on October 18, 2020 11:42 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago