ఒకేసారి ఇద్దరు హీరోలకు ఒకే క్రేజీ టైటిల్ అవసరమైనప్పుడు దాని చుట్టూ తలెత్తే పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. దానికో ప్రత్యక్ష ఉదాహరణ కళ్ళముందు కనిపిస్తోంది. ఇటీవలే అమరన్ తో అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధా కొంగర (ఆకాశం నీ హద్దురా) దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దశాబ్దాల క్రితం తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా వివాదాస్పద అంశాలతో రూపొందుతోంది. తొలుత సూర్యతో చేయాలని అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ తర్వాత ఏవేవో కారణాల వల్ల క్యాస్టింగ్ మారిపోయింది.
ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీకి పరాశక్తి అనే పేరుని నిర్ణయించినట్టు చెన్నై న్యూస్. ఇవాళ అధికారిక ప్రకటన రాబోతోందంట. ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందుతున్న శక్తి తిరుమగన్ మూవీకి ఇతర భాషల్లో పరాశక్తి టైటిల్ నే డిసైడ్ చేశారు. ఆ మేరకు అధికారికంగా పోస్టర్లు కూడా వదిలారు. ఇది అయోమయానికి దారి తీస్తోంది. ఇంకోవైపు చెన్నైకి చెందిన శివాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అసలెవరూ దీన్ని వాడుకోకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1952లో వచ్చిన ఈ క్లాసిక్ అలాగే నిలిచిపోవాలంటే ఎవరూ ఈ పేరు పెట్టుకోకూడదని డిమాండ్ చేస్తోంది. లీగల్ గా మాత్రం అడ్డుకోలేదు.
చివరికి ఎవరు రాజీ పడతారో కానీ మొత్తానికి కోలీవుడ్ లో పరాశక్తి హాట్ టాపిక్ గా మారింది. ముందుగా రిలీజయ్యేది మాత్రం విజయ్ ఆంటోనీదే. వేసవి విడుదలని పోస్టర్ లో చెప్పేశారు. మరి ఈ పంచాయితీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. వాస్తవానికి పరాశక్తికున్న కల్ట్ స్టేటస్ చిన్నది కాదు. హిందీలో షోలే, తెలుగులో మాయాబజార్ లాగా తమిళంలో దీనికి అజరామరమైన కీర్తి ఉంది. అలాంటిది కమర్షియల్ ఎంటర్ టైనర్లకు ఎలా పెడతారనేది ఫ్యాన్స్ ప్రశ్న. తెలుగులో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. మిస్సమ్మ, శంకరాభరణం, అడవి రాముడు లాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ పేర్లను శుభ్రంగా వాడేశారు.
This post was last modified on January 29, 2025 3:40 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…