నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోలలో నంబర్‍వన్ అనుకోవచ్చు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఇటీవలి ట్రాక్ రికార్డ్ మాత్రం ఏమంత గొప్పగా లేదు. జెర్సీ మినహాయిస్తే ఇటీవలి కాలంలో నాని చేసిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే హీరోగా ఒక రేంజ్‍కి చేరుకున్న దశలో తన సినిమాల బడ్జెట్ పరంగా నాని చాలా జాగ్రత్తగా వుండేవాడు. తన పారితోషికం పెరిగినా కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా అన్ని సినిమాలు ఒకే రేంజ్‍లో వుండేట్టు చూసుకునేవాడు.
కానీ ఇప్పుడు నాని సినిమాల బడ్జెట్ కంట్రోల్‍లో వుండడం లేదు. ‘వి’ చిత్రానికి భారీగానే ఖర్చయింది. అంతకుముందు గ్యాంగ్‍లీడర్, దేవదాస్ చిత్రాలకు కూడా ఓవర్ బడ్జెట్ అయింది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి కూడా బడ్జెట్ నలభై కోట్లు పైగానే అవుతుందనే అంచనాలతో ఆ చిత్రాన్ని నిర్మించాలనుకున్న సూర్యదేవర నాగవంశీ ఇటీవలే తప్పుకున్నాడు. ఆ చిత్రాన్ని నాని మరో నిర్మాత చేతుల్లో పెట్టాడు.
కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని నాని గుర్తించాలి. తన సినిమాలకు అయ్యే ఖర్చు పాతిక నుంచి ముప్పయ్ కోట్లు అయ్యేట్టు చూసుకుంటే అన్నీ సేఫ్ జోన్‍లోనే వుంటాయి. స్టార్‍గా ఎదుగుతోన్న దశలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటూ గీత దాటకుండా జాగ్రత్త పడితే ఇదేమంత సమస్య కాబోదు.
This post was last modified on October 18, 2020 1:48 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…