హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు నార్త్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో కళ్లుచెదిరే వ్యూస్ తెచ్చుకుంటాయి. నెల రోజుల క్రితం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ తక్కువ టైంలో 100 మిలియన్ వ్యూస్ దాటేయడం అభిమానులనే ఆశ్చర్యపరుస్తోంది.
ట్విస్ట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ మొదటి భాగం నాలుగు సంవత్సరాల క్రితం పెడితే ఇప్పటిదాకా 386 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కానీ అతి తక్కువ టైంలో డబుల్ ఇస్మార్ట్ ఇంత వేగంగా దూసుకుపోవడం అనూహ్యం. ఇలా అయితే ఏడాది లోపే ఫైవ్ హండ్రెడ్ మిలియన్లు దాటేలా ఉంది.
మన తెలుగు ఊర మాస్ సినిమాలను ఉత్తరాది ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడతారు. అందులోనూ రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నితిన్ లాంటి వాళ్ళకు ఈ మార్కెట్ చాలా పెద్దది. వారియర్, స్కంద లాంటివి సైతం మూడు వందల మిలియన్లు దాటేశాయి.
హలో గురు ప్రేమ కోసమే ఏకంగా 584 మిలియన్ వ్యూస్ తో టాప్ పొజిషన్ లో ఉంది. కేవలం రామ్ వి మాత్రమే చూస్తే వచ్చిన నెంబర్లు ఇవి. ఇతర హీరోలవి లెక్క వేసుకుంటే మతిపోవడం ఖాయం. డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా నటించడం, క్యాస్టింగ్ లో పలువురు బాలీవుడ్ నటీనటులు ఉండటం ఈ స్పందనకు కారణంగా చెప్పొచ్చు.
ఈ ట్రెండ్ ని గమనించి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సరైన మాస్ కంటెంట్ ఇస్తే జనాలు ఏ స్థాయిలో ఆదరిస్తారోనని. పుష్ప 2 ఎనిమిది వందల కోట్ల వసూళ్ల సాక్షిగా దీన్ని నిరూపించింది. భవిష్యత్తులో నార్త్ మార్కెట్ మనకు బంగారు గనిగా మారుతుంది. సరిగ్గా తవ్వుకుంటే కనకవర్షం కురుస్తుంది.
అక్కడి దర్శక రచయితలు చేయలేకపోతున్న మాస్ ఎంటర్ టైనర్లు తెలుగు డైరెక్టర్లు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ ఒకవేళ ఎలాంటి లోపాలు లేకపోయి ఉంటే థియేటర్లలోనూ వసూళ్ల రికార్డులు కొల్లగొట్టేది. పూరి జగన్నాథ్ ఇకనైనా తనలో వింటేజ్ ఫిలిం మేకర్ ని బయటికి తీసుకొచ్చి పోకిరి లాంటివి ఇవ్వాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on January 28, 2025 8:22 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…