Movie News

రష్మిక సినిమా నుంచి ఈ సీన్లు తొలగిస్తున్నారు…

బాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ సినిమా.. చావా. గత ఏడాది డిసెంబరు తొలి వారంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు ‘పుష్ప-2’తో పోటీ పడడం మంచిది కాదని వెనక్కి తగ్గారు. షూట్ కూడా కొంచెం ఆలస్యం కావడంతో సినిమాను ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు. రిలీజ్ ముంగిట సినిమాను చిత్ర బృందంలో గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

కానీ అందులో కొన్ని షాట్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ట్రైలర్లో శంభాజీ పాత్రధారి అయిన విక్కీ కౌశల్ డ్యాన్సులు వేయడం మరాఠీలను హర్ట్ చేసింది. దీంతో పాటు కొన్ని సీన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం సదరు సన్నివేశాల మీద అభ్యంతరం చెప్పారు.

చరిత్రను వక్రీకరించడం తప్పన్నారు. మరో మంత్రి సైతం చరిత్రను వక్రీకరిస్తే సినిమాను ఆడనివ్వమని తేల్చి చెప్పారు. వ్యవహారం సీరియస్‌గా మారడంతో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. అభ్యంతరంగా అనిపిస్తున్న ప్రతి సన్నివేశాన్నీ సినిమా నుంచి తొలగిస్తామని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు మహారాష్ట్రలోనే అడ్డంకులు ఎదురైతే.. చాలా కష్టమవుతుంది.

అందుకే ఆలస్యం చేయకుండా చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొందరు స్కాలర్లకు చూపించి.. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రిలీజ్ చేయాలని కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అవసరమైతే ఆ పని కూడా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. విక్కీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించింది ఈ చిత్రంలో. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో తనకు ఈ చిత్రం మరో బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశిస్తోంది.

This post was last modified on January 28, 2025 6:27 pm

Share

Recent Posts

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

5 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

13 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago