Movie News

ఇద్దరు భామలతో భయపెట్టనున్న లారెన్స్

ఇప్పుడంటే కొంత రొటీన్ అనిపిస్తుంది కానీ కొన్నేళ్ల క్రితం కామెడీ హారర్ అనే కొత్త జానర్ ని మునితో ప్రవేశపెట్టింది రాఘవ లారెన్సే. దీన్ని చాలా మంది హీరోలు, దర్శకులు ఫాలో అయిపోయి సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. కాంచన పేరుతో ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్న లారెన్స్ ఒకే కథను తిప్పి తిప్పి తీస్తాడనే కామెంట్స్ అందుకున్నప్పటికీ కమర్షియల్ అవన్నీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుండటంతో అతనూ ఆగడం లేదు.

ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినా పెద్ద స్కేల్ తో కాంచన 4కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత వారమే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యిందని సమాచారం.

అసలు విశేషం ఇది కాదు. కాంచన 4లో ప్రధాన ఆకర్షణగా ఇద్దరు భామలు నిలవబోతున్నారు. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కావడం అన్నింటి కన్నా పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే ఇప్పటిదాకా అగ్ర హీరోల సరసన జోడి కడుతూ వచ్చిన బుట్టబొమ్మ అసలు దెయ్యాల సినిమాలే చేయలేదు.

అందులోనూ లారెన్స్ లాంటి టయర్ 2 స్టార్ తో. కానీ ఇప్పుడు ఒప్పుకుందంటే ఏదో విశేషమే ఉంటుంది. ఇన్స్ సైడ్ టాక్ ప్రకారం పూజా హెగ్డేది కేవలం ఆడిపాడే గ్లామరస్ రోల్ కాదట. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే బలమైన క్యారెక్టర్ ని లారెన్స్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అంటే దెయ్యంగా భయపెడుతుందేమో చూడాలి.

గ్లామర్ పార్ట్ కోసం నోరా ఫతేని తీసుకున్నారట. ఇటీవలే వరుణ్ తేజ్ మట్కాలో చేయడం తెలిసిందే. పేరుకి హారరే అయినా నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ దీనికి భారీ బడ్జెట్ పెడుతోంది. వంద కోట్ల పైమాటేనట. బాలీవుడ్ లో అసలే భూతాల సినిమాలకు భారీ మార్కెట్ ఉంది.

స్త్రీ 2, భూల్ భులయ్యా 3, ముంజ్యా, షైతాన్ అన్నీ సూపర్ హిట్లే. వాటిని తలదన్నే గ్రాండియర్ తో కాంచన 4 ఉంటుందట. అందుకే ఓటిటి హక్కులను ఎనిమిది వారాల విండోతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారని తెలిసింది. ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటం చూస్తుంటే లారెన్స్ ఏదో అంచనాలకు మించి భయపెట్టేలా ఉన్నాడు.

This post was last modified on January 28, 2025 10:50 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

28 minutes ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

41 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

2 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 hours ago