అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం తాండవం మాములుగా లేదు. పండగ అయిపోయి జన జీవనం మాములైనప్పటికీ వీకెండ్ వస్తే చాలు దీని థియేటర్ల దగ్గర టికెట్ ముక్క దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
నిన్న ఆదివారం చాలా చోట్ల సింగల్ స్క్రీన్ల దగ్గర మగాళ్ల కంటే లేడీస్ క్యూలు పెద్దగా కనిపించిన దాఖలాలు బోలెడున్నాయి. మూడుకంటే ఎక్కువ స్క్రీన్లున్న సముదాయాల్లో ఇతర కొత్త రిలీజులు క్యాన్సిల్ చేసి మరీ వెంకటేష్ కిచ్చినా సరిపోలేదంటే వైడి రాజు ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీమ్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం 276 కోట్ల గ్రాస్ దాటేసింది. నెక్స్ట్ టార్గెట్ 300 కోట్లు. ఇది చాలా తేలిగ్గా అందుకోబోతోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఫిబ్రవరి 7 తండేల్ రావడానికి ఇంకా పది రోజుల సమయముంది. అప్పటిదాకా వెంకీని ఎవరూ ఆపలేరు.
ఓవర్ సీస్ లో నెమ్మదించినప్పటికీ ఇప్పటికే మూడు మిలియన్లకు దగ్గరగా వెళ్ళింది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో అమ్ముడుపోయిన టికెట్లు 1 లక్ష 70 వేలకు పైగానే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ లెక్కలు వేరు. మూడు రోజుల క్రితం ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం అమ్మకాలకు మరింత దోహదం చేసింది.
ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాం ఏ ఫిగర్ దగ్గర ఆగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. వీక్ డేస్ లో మరీ తీవ్రంగా నెమ్మదించకపోవడం ఊరట కలిగించే విషయం. మూడు వందల పాతిక కోట్ల దగ్గర ఆగొచ్చనే ఒక అంచనా ఉండగా మరో పాతిక అదనంగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాకపోతే తండేల్ టాక్ కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ అది పాజిటివ్ గా ఉన్నా సరే పుష్ప 2 లాగా సంక్రాంతికి వస్తున్నాం కనీసం నలభై రోజుల దాకా స్ట్రాంగ్ గా ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్. అదే జరిగితే కనక టాప్ 4 సీనియర్ స్టార్లలో వెంకటేష్ అగ్ర స్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యం లేదు. దానికోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 27, 2025 5:54 pm
యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…