గత డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దానికి తెరపడనుందని సమాచారం. జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేట్రికల్ విండోని 56 రోజులకు నిర్ణయించుకోవడం వల్ల సాధారణంగా తెలుగు సినిమాలు తీసుకునే గ్యాప్ కంటే పుష్ప 2 ఎక్కువే వాడుకుంది.
ఇటీవల అదనంగా ఇరవై నిమిషాలు జోడించిన రీ లోడెడ్ వెర్షనే అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే మొత్తం 3 గంటల 44 నిముషాలు. సెన్సార్ సర్టిఫికెట్, స్మోకింగ్ డ్రింకింగ్ యాడ్స్ లాంటివి నెట్ ఫ్లిక్స్ లో ఉండవు.
మాములుగా ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా మహా అయితే నాలుగు వారాల ఓటిటి గడువు తీసుకుంటున్న ట్రెండ్ లో పుష్ప 2 ఇలా 56 రోజుల ప్లాన్ ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. హిందీ వెర్షన్ ని మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలనే నిబంధన ఉత్తరాది ఎగ్జిబిటర్లు కఠినంగా పాటిస్తున్నారు.
ఒకవేళ కాదంటే సదరు సినిమా స్క్రీనింగ్ వాటి సముదాయాల్లో ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ లేట్ ఓటిటికి ఓటు వేయడం వల్లే నార్త్ లో వారాల తరబడి భారీ వసూళ్లు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
సో ఇంకో మూడు రోజులు ఎదురు చూస్తే ఇంట్లోనే పుష్పరాజ్ అరాచకం చూడొచ్చు. డిజిటల్ ఇంత దగ్గరికి వచ్చినా కూడా పుష్ప 2 దూకుడు థియేటర్లలో ఇంకా పడిపోలేదు. నిన్న బుక్ మై షోలో 13 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. కరెంట్ బుకింగ్ వేరుగా ఉంటుంది.
అంటే ఇంకా పుష్ప 2 చూసేందుకు జనం వెళ్తూనే ఉన్నారన్న మాట. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్, స్కై ఫోర్స్ లాంటి కొత్త రిలీజులు బోలెడున్నా బన్నీ మూవీ 53వ రోజు కూడా ఇంత బలంగా హోల్డ్ చేయడం గొప్పే. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఎన్ని మిలియన్ల వ్యూస్, రికార్డులు దక్కబోతున్నాయో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on January 27, 2025 3:31 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…