పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికంతా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావడం కష్టమనే వార్తలు విశ్వసనీయ వర్గాల ద్వారా రావడంతో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర సూరన్ పార్ట్ 2 (కాళి), ఎల్2 ఎంపురాన్ ఆఘమేఘాల మీద ఆ డేట్ ముందు వెనుకా వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
వీటిలో చివరిదైన మోహన్ లాల్ మూవీ మాత్రమే ఎప్పుడో అధికారిక ప్రకటన ఇచ్చింది కానీ మిగిలినవి మాత్రం ఇటీవల అనౌన్స్ మెంట్లు వచ్చినవే. తాజాగా మరో ట్విస్టు వచ్చి పడింది. కొత్త అనుమానాలకు తావిచ్చేలా చర్చ నడుస్తోంది.
బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషించిన ఔరంగజేబ్ పాత్రని రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ఒకటి వదిలారు. అందులో మార్చి 28 తేదీనే ఉంది. అంటే వాయిదా సూచనలు లేవని చెబుతున్నారని అనుకోవాలా అంటూ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం పోస్ట్ పోన్ గురించి ఎప్పుడూ చెప్పలేదు.
కాకపోతే ప్రమోషన్ల స్పీడ్ పెంచకపోవడం అనే ఒక కంప్లయింట్ తప్ప ఫ్యాన్స్ కి ఇది టైంకి రావాలనే ఉంది. కానీ మైత్రి, సితార లాంటి పెద్ద సంస్థలు వీరమల్లు డేట్ ని తీసుకున్నాయంటే ఖచ్చితంగా పవర్ స్టార్ రావడం లేదనే అర్థం వస్తుంది. అందుకే ఇంత అయోమయం.
ప్రస్తుతం చివరి దశలో ఉన్న హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ ఇంకో వారం రోజులు డేట్స్ ఇస్తే మొత్తం అయిపోతుందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మంగళగిరి ప్రాంతాల్లో ప్రత్యేక సెట్లు వేస్తున్నారని సమాచారం. డిప్యూటీ సిఎంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్ కు డేట్లు సర్దుబాటు చేయడం పెద్ద సవాల్ గా మారింది.
ఓజి కూడా బ్యాలన్స్ ఉంది. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలి. ఈ మూడు అయిపోతే సీరియస్ పొలిటీషియన్ గా ఎక్కువ సమయం మంత్రిగా గడపాలని నిర్ణయించుకున్నారట. ఏదో ఒకటి ముందైతే హరిహర వీరమల్లు మార్చి 28కి వచ్చేది లేనిది ఏదైనా ప్రమోషన్ ద్వారా క్లారిటీ ఇస్తే బెటర్.
This post was last modified on January 27, 2025 11:48 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…