Movie News

బాలయ్యను ఇలా ఎవరైనా ఊహించారా?

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య.. ‘నరసింహనాయుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ఆయన సినిమాలు ట్రోల్ మెటీరియల్స్‌గా మారిపోయి. ఒక దశలో ఆయనిక పుంజుకోవడం కష్టమే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు కూడా. కానీ ‘సింహా’ మూవీతో బలంగా పుంజుకున్నాడు బాలయ్య.

ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక హిట్ కొట్టడం.. మళ్లీ డౌన్ అవడం.. ఇలా సాగింది ఆయన కెరీర్. 2019లో యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ చిత్రాలు చేదు అనుభవాలను మిగల్చడంతో మళ్లీ బాలయ్య కెరీర్లో పతనం మొదలైనట్లే కనిపించింది. బాలయ్య మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి ఆ చిత్రాలు. ఇక మళ్లీ బాలయ్య రైజ్ కావడం కష్టమే అనుకున్నారు చాలామంది.

కానీ ఇప్పుడు చూస్తే బాలయ్య సక్సెస్ రేట్‌ను అందుకోవడం వేరే హీరోలకు కష్టంగా ఉంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లతో తిరుగులేని స్థితికి చేరుకున్నాడీ నందమూరి హీరో. 2021లో వచ్చిన ‘అఖండ’ మూవీతో బాలయ్య దశ తిరిగింది. అంతకుముందు బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ల ఇచ్చిన బోయపాటి.. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అందించాడు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయింది.

తర్వాత ఒకే ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నాడు బాలయ్య. దీంతో హ్యాట్రిక్ పూర్తయింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో సంక్రాంతికి మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు విడుదల ముంగిట తక్కువ బజ్ కనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. హిట్ టాక్ తెచ్చుకున్న ‘డాకు మహారాజ్’ సంక్రాంతి అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకుని భారీ వసూళ్లు రాబట్టింది.

బాలయ్య కెరీర్లో మరో బిగ్ హిట్‌గా నిలిచింది. కెరీర్లో ఈ దశలో బాలయ్య ఇలా వరుసగా విజయాలు సాధించడం, మళ్లీ కెరీర్ పీక్స్‌ను అందుకోవడం అనూహ్యం. ఆయన సక్సెస్ స్ట్రీక్ చూసి మిగతా హీరోలు అసూయ చెందుతుంటే ఆశ్చర్యం లేదు.

This post was last modified on January 25, 2025 5:13 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

1 hour ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

7 hours ago