సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టమైపోతోంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల తరహాలో తమ వయసులో సగం, మూడో వంతు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇప్పటి సీనియర్ హీరోలు ఇబ్బంది పడిపోతున్నారు. ఈ తరం ప్రేక్షకులు కూడా అలాంటి జోడీలను చూడటానికి ఇష్టపడట్లేదు. యువ కథానాయకులతో ఆడిపాడుతున్న యంగ్ స్టార్ హీరోయిన్లు సీనియర్ల పక్కన నటిస్తే వాళ్లకు ఏదోలా అనిపిస్తోంది.
కొన్ని సినిమాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కాంబినేషన్లు కుదురుతున్నా.. చాలా వరకు ఇబ్బంది తప్పట్లేదు. దీంతో సీనియర్ల కోసం అంతగా ఫేమ్ లేని, వేరే ఇండస్ట్రీల అమ్మాయిల్ని వెతికి వెతికి తీసుకొస్తున్నారు. లేదంటే అంతకుముందు పని చేసిన సీనియర్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు.
ఇలా హీరోయిన్లను సెట్ చేయడంలో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. గత కొన్నేళ్లలో బాలయ్య సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా అంతగా క్రేజ్ లేని హీరోయిన్లతో నెట్టుకొస్తున్నారు. చివరగా ఆయన నటించిన ‘రూలర్’లో సోనాలి చౌహాన్, వేదిక లాంటి ఔట్ డేటెడ్ హీరోయిన్లే నటించారు. ఇక బాలయ్య-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా సరైన హీరోయిన్ సెట్టవ్వలేదు. ఈ సినిమాను కరోనాకు ముందే హీరోయిన్ ఫిక్స్ కాకుండానే మొదలుపెట్టారు. లాక్ డౌన్ టైంలో కూడా హీరోయిన్ ఓకే కాలేదు. గత కొన్ని నెలల్లో రకరకాల పేర్లు వినిపించాయి.
చివరికిప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని కథానాయికను ఈ చిత్రానికి ఓకే చేశారట. ఆమె పేరు ప్రయాగ మార్టిన్. ఈ అమ్మాయి తెలుగులోకి ‘పిశాచి’ పేరుతో డబ్ అయిన తమిళ చిత్రం ‘పిసాసు’లో నటించింది. అందులో ఆమెది దయ్యం పాత్ర. సినిమాలో ఆమె ఒరిజినల్ ముఖం కనిపించేది కొన్ని నిమిషాలే. మలయాళ అమ్మాయి అయిన ప్రయాగ.. అంత పాపులర్ హీరోయినేమీ కాదు. మరి బాలయ్య పక్కన ఈమెను ఎంపిక చేయడానికి కారణమేంటో?
This post was last modified on October 17, 2020 10:18 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…