గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి చాలా టైముంది. మోక్షజ్ఞ డెబ్యూని దక్కించుకున్నా డిసెంబర్ లో ప్రారంభోత్సవం వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు.
ఈలోగా తన రచన నిర్మాణంలో వేరే దర్శకురాలితో ప్రశాంత్ వర్మ మహాకాళిని ప్రకటించాడు. అధీరా పనులు చూసుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ భేడియా 2లోనూ చెయ్యి వేస్తున్నాడనే టాక్ ఉంది కానీ సరైన సమాచారం లేదు. కథ అందించిన దేవకీనందన వాసుదేవ ఆడలేదు.
ఇవన్నీ ఎలా ఉన్నా దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడమే భేతాళ ప్రశ్నగా మారింది. ఒకవేళ మోక్షజ్ఞది మరింత ఆలస్యం అనుకుంటే ఇంకో ప్రాజెక్టు మొదలుపెట్టడం ఉత్తమం. కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి వస్తే తప్ప జై హనుమాన్ ని స్టార్ట్ చేయలేని పరిస్థితి.
ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీ చెయ్యి దాకా వచ్చి జారిపోయింది. హనుమాన్ టైంలో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో ప్రశాంత్ వర్మ జాగ్రత్తగా వేస్తున్న అడుగులు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ లెక్కన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదేమో.
ఏదైనా నేరుగా అడుగుదామంటే ప్రశాంత్ వర్మ అందుబాటులోకి రావడం లేదు. కొత్త ఆఫీస్ లో బిజీగా ఉంటున్నాడు తప్పించి ఏదైనా ఈవెంట్ లోనూ దర్శనం ఇవ్వడం లేదు. వచ్చినా మోక్షజ్ఞ గురించి అడుగుతారు కాబట్టి అదేంటో తేలేవరకు అంత సులభంగా బయట కనిపించకపోవచ్చు.
ఇంకోవైపు జాంబీ రెడ్డి 2ని వేరే దర్శకుడితో సితార బ్యానర్ మీద నిర్మించే ప్రతిపాదన దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. అయినా హనుమాన్ లాంటి అంత పెద్ద హిట్టు కొట్టాక ఈ గ్యాప్ రావడం విచిత్రమే. వచ్చిన వాటిలో ఒకటి క్యాన్సిల్, మరొకటి డిలే కావడం విధి లిఖితం. ఇంకొద్దిరోజుల్లో ఏమైనా క్లారిటీ రావొచ్చు.
This post was last modified on January 22, 2025 3:14 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…