కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు. వీటి సరసన చోటు దక్కించుకున్న బ్లాక్ బస్టర్ పాతాళ్ లోక్ (2020). అయిదేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగంకు చాలా ప్రశంసలు దక్కాయి. వ్యూస్ పరంగా అమెజాన్ ప్రైమ్ కు భారీ ఆదాయం వచ్చింది.
మరింత గ్రాండ్ గా సెకండ్ సీజన్ తీశారు. క్యాస్టింగ్ ని కొనసాగిస్తూనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పెద్ద హీరో లేకుండా జైదీప్ ఆహ్లావత్ లాంటి సపోర్టింగ్ ఆర్టిస్టు మీద ఇంత బడ్జెట్ పెట్టడం చిన్న విషయం కాదు. తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉన్న పాతాళ్ లోక్ 2 ఎలా ఉందంటే.
నాగాలాండ్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమ్మిట్ కు వచ్చిన జోనాథన్ తామ్ తన హోటల్ గదిలో దారుణంగా హత్యకు గురవుతాడు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకున్న ఇమ్రాన్ అన్సారీ (ఇశ్వాక్ సింగ్) తనకు సహాయంగా హాథీరాం చౌదరి (జైదీప్ ఆహ్లావత్) తీసుకుని నాగాలాండ్ వెళ్తాడు.
కానీ అక్కడ పరిస్థితులు వీళ్ళను ప్రమాదంలో నెడతాయి. రెండు మర్డర్ కేసులకు మూలాలు అక్కడే ఉన్నాయని అర్థమవుతుంది. బిజినెస్ మ్యాన్ కపిల్ రెడ్డి (నగేష్ కుకునూర్) ప్రమేయం తెలిశాక రిస్క్ ఇంకా పెరుగుతుంది. అయితే అసలు దోషులు ఎవరనేది మాత్రం సిరీస్ లో చూస్తేనే అసలు థ్రిల్.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో సుమారు ఆరు గంటల నిడివి ఉన్న పాతాళ్ లోక్ 2 ఆద్యంతం ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ ఆసక్తిగా నడిపించడంలో దర్శకులు అవినాష్ అరుణ్ – ప్రోసిత్ రాయ్ విజయం సాధించారు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత వయొలెన్స్, డెప్త్ సీజన్ 2 లో లేకపోవడం వీరాభిమానులకు నిరాశ కలిగించవచ్చు.
పైగా నాగాలాండ్ చుట్టే కథను మొత్తం నడిపించడం ల్యాగ్ కు దారి తీసింది. ఇంకొంచెం పట్టుగా నడిచి ఉంటే బెస్ట్ అయ్యేది కానీ అలాని తీవ్రంగా నిరాశపరిచేలా లేదు. సరిపడా టైం ఉంటే ఓ లుక్ వేయొచ్చు కానీ డోంట్ మిస్ క్యాటగిరని మాత్రం చెప్పలేం.
This post was last modified on January 21, 2025 3:28 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…