ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి మధ్య వైరుధ్యం ఉండటమే కాక ఫలితాలు కూడా రివర్స్ లో రావడం అనూహ్యం. అంజలికి ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురయ్యింది. రిలీజ్ ముందు వరకు గేమ్ ఛేంజర్ మీద ఆమె పెట్టుకున్న ఆశలు అన్ని ఇన్ని కావు.
కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని అమెరికా నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడ ప్రమోషన్లు చేసినా వద్దనకుండా వెళ్ళింది. మీడియాలో ఎవరు అడిగినా కాదనకుండా ఇంటర్వ్యూలు ఇచ్చింది. తీరా చూస్తే రామ్ చరణ్ సరసన నటించిన ఆనందం తప్ప ఫలితం మర్చిపోలేని గాయం చేసింది.
అప్పన్న భార్యగా, రామ్ నందన్ తల్లిగా రెండు షేడ్స్ తనకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక రెండో వైపుకు వస్తే అంజలి ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం నటించిన తమిళ సినిమా మదగజరాజా ఆలస్యంగా పొంగల్ పండక్కు వచ్చి ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఏకంగా నలభై కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి తమిళనాడులో గేమ్ చేంజర్ ని వెనక్కు తోసినంత పని చేసింది. తొలుత దీన్ని లైట్ తీసుకున్న అంజలి తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్ కు వెళ్లి విశాల్ టీమ్ తో పాటు తన ఆనందాన్ని పంచుకుంది. మర్చిపోవాలనుకున్నది పెద్ద బ్రేక్ అయ్యింది.
ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో. మదగజరాజా ఇంకా తెలుగు డబ్బింగ్ రాలేదు. నిర్మాతలు ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. సరైన టైం చూసి రిలీజ్ చేస్తే ఇక్కడా అదే స్పందన దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నారు. అంజలి ఈసారి పబ్లిసిటీలో భాగమవొచ్చు.
గేమ్ ఛేంజర్ లో తన క్యారెక్టర్ ని దర్శకుడు శంకర్ తీర్చిదిద్దిన విధానం విమర్శకులను అనుకున్న రీతిలో మెప్పించలేకపోయింది. ఆడియన్స్ లోనూ ఊహించినంత గుర్తింపు రాలేదు. కానీ మదగజరాజాలో హుషారుగా చేసిన పాత్రే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పాటకు ఇదే మంచి ఉదాహరణ.
This post was last modified on January 21, 2025 11:41 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…