కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో మీరే చూడండి. గత ఏడాది అక్టోబర్ లో బెంగళూరు దగ్గర్లోని పీన్య ప్రాంతంలో టాక్సిక్ షూటింగ్ జరుగుతోంది. దీని కోసం వేలాది చెట్లు నరికివేశారనే ఫిర్యాదు మీద అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నారు.
వచ్చిన కంప్లయింట్ నిజమేనని నిర్ధారించుకుని షాక్ తిన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా వందలాది ఎకరాలు చదును చేయడం వల్ల పచ్చదనం హరించుకుపోయిందనేది టాక్సిక్ మీద వచ్చిన ప్రధాన వివాదం.
తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరఫున నోటీస్ వెళ్ళింది. హిందుస్థాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు ఈ అటవీ ప్రాంతం కట్టబెట్టారనే దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాబినెట్ ఆమోదం లేకుండా డీనోటిఫికేషన్ అప్రూవల్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన ఈ కాంట్రావర్సి అంత సులభంగా ముగిసేలా లేదు.
సదరు కంపెనీ తమ పరిధిలో లేని ప్రాంతాన్ని కూడా షూటింగుల అద్దెకు ఇవ్వడం వల్లే ఈ అనర్థం జరిగిందని స్థానికుల ఆరోపణ. గత నాలుగైదు నెలలుగా దీన్ని ఫాలో అప్ చేస్తున్న అధికారులు ఎట్టకేలకు నోటీసులు ఇవ్వడం ద్వారా షూటింగ్ ఆపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే చాలా ఆలస్యంగా మొదలైన టాక్సిక్ కి డిసెంబర్ విడుదలను టార్గెట్ చేసుకున్నారు కానీ ఇలాంటి అడ్డంకులు చూస్తుంటే టైంకి రిలీజ్ చేయడం అనుమానంగానే ఉంది. ఇటీవలే వచ్చిన టీజర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎలివేషన్ కన్నా రొమాన్స్ ఎక్కువయిందనే కామెంట్స్ వినిపించాయి.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ లో కియారా అద్వానీ హీరోయిన్ కాగా మరో ప్రధాన పాత్రలో నయనతార ఉన్నది లేనిది టీమ్ అఫీషియల్ గా చెప్పడం లేదు. యష్ కు మాత్రం ఈ సినిమా మీద చాలా ఆశలున్నాయి. బడ్జెట్ మూడు వందల కోట్లకు పైమాటేనని బెంగళూరు టాక్.
This post was last modified on January 21, 2025 10:50 am
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…