మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు కొనసాగిస్తున్నారు. మంచు కుటుంబంలో రేగుతున్న వివాదాలు ఇంటా బయటా ఇబ్బందికరంగా మారినప్పటికీ విష్ణు మాత్రం పబ్లిసిటీ విషయంలో గతంలో వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకుని దానికి అనుగుణంగానే మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు.
తాజాగా శివుడి రూపంలో వచ్చిన అక్షయ్ కుమార్ లుక్, ఇంతకు ముందు పార్వతిగా కాజల్ అగర్వాల్ పోస్టర్ రెండూ ట్రోలింగ్ బారిన పడకుండా డీసెంట్ అనిపించుకున్నాయి.
గతంలో మోహన్ లాల్, దేవరాజ్, మధుబాల, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్ తదితరులను పోస్టర్లలో రివీల్ చేసినప్పుడు అంత మద్దతు దక్కలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మెల్లగా మారుతోంది. అసలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. శివరాత్రి పండగ సందర్భంగా దాన్ని రివీల్ చేసే ఆలోచనలో కన్నప్ప టీమ్ ఉంది.
వీలైతే టీజర్ లేదా స్టిల్ వదులుతారు. రిలీజ్ ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి హడావిడి లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రభాస్ క్యామియో ఇరవై నిమిషాలకు పైగా ఉంటుందన్న లీక్ ఒక్కసారిగా కన్నప్ప మీద ఆసక్తిని పెంచుతోందన్నది నిజం.
ఏప్రిల్ లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కన్నప్ప మీద విష్ణు కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. ఎంత ఖర్చు పెట్టినా అంతకంతా వెనక్కు ఇచ్చే స్థాయిలో వస్తోందని ధీమాగా చెబుతున్నారు. ఆ మధ్య రచయిత బివిఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ చూశానని, ఎక్స్ ట్రాడినరిగా వచ్చిందని చెప్పిన మాటలు బజ్ పరంగా ఉపయోగపడేవే.
భారీ క్యాస్టింగ్ తో రూపొందుతున్న కన్నప్ప మీద చాలా మంది రైటర్లు పని చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భక్తి రసాత్మక చిత్రంలో శరత్ కుమార్, బ్రహ్మాజీ, ముఖేష్ ఋషి, ప్రభుదేవా, సాయికుమార్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ చాలా పెద్దదే ఉంది.
This post was last modified on January 20, 2025 6:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…