ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్ ఉండటం గొప్ప. వెయ్యి రెండు వేల కోట్లు ఎంత వసూలు చేసినా అప్పటికంతా జరిగిపోవాలి. ఈలోగా ఓటిటి డేట్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి జనాలు క్రమంగా థియేటర్లకు వెళ్లడం తగ్గించేస్తారు.
కానీ పుష్ప 2 ది రూల్ మాత్రం రివర్స్ లో వెళ్తోంది. రీలోడెడ్ వెర్షన్ పేరుతో అదనంగా 20 నిముషాలు జోడించి ఇప్పటికే ఉన్న లెన్త్ ని మరింత పొడిగించినా ఆడియన్స్ వెళ్తూనే ఉన్నారు. గత మూడు రోజులుగా బుక్ మై షో అమ్మకాల్లో గేమ్ ఛేంజర్ కన్నా పై చేయి సాధించడం కన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు.
నిన్న ఆదివారం సుమారు 26 వేల టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం. కౌంటర్ సేల్స్ కలుపుకుంటే ఈ నెంబర్ ఇంకా అధికంగా ఉంటుంది. 46వ రోజు ఈ ఫీట్ సాధించడం చాలా అరుదు. హైదరాబాద్ సంధ్యతో మొదలుపెట్టి జిల్లా కేంద్రాల్లో థియేటర్ల దాకా నిన్న దాదాపుగా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడటం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ తర్వాత జనం కనిపించించింది పుష్ప 2కే. బుకింగ్స్ లో ఇదే స్పష్టమవుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, దేవరలు సైతం నెల రోజుల తర్వాత బాగా నెమ్మదించాయి కానీ అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే అంటూ అరాచకం సృష్టిస్తూనే ఉన్నాడు.
విశేషం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల సునామిలోనూ పుష్ప 2 ఇంతగా తట్టుకుని నిలబడటం. ఇంకో మూడు రోజుల్లో అర్ధ శతదినోత్సవం జరగబోతున్న నేపథ్యంలో దాని సెలబ్రేషన్స్ కోసం అభిమానులు రెడీ అవుతున్నారు. భారీగా కాకుండా గుర్తుండిపోయేలా ఒక చిన్న ఈవెంట్ చేసే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్టు తెలిసింది.
ఇంకో రెండు రోజుల్లో నిర్ధారణ కావొచ్చు. కొత్త రిలీజుల వల్ల 50 డేస్ స్ట్రెయిట్ సెంటర్ల నెంబర్ తగ్గి ఉండొచ్చు కానీ చరిత్రలో మాత్రం బన్నీ – సుకుమార్ సాధించిన మైలురాళ్లు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. రాబోయే కాలంలో కొత్త సినిమాలు నాన్ పుష్ప రికార్డులకే తెగ కష్టపడాల్సి ఉంటుంది.
This post was last modified on January 20, 2025 12:04 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…