Movie News

సైఫ్ పై దాడి.. కరీనా వాంగ్మూలంలో కీలక విషయాలు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ ముంబై నివాసంలో దుండగుడు చొరబడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యుల చర్యలతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. లీలావతి ఆస్పత్రి వైద్యులు సైఫ్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని తెలిపారు.

దాడి చేసిన నిందితుడు అప్పటికీ పోలీసుల చేతికి చిక్కలేదు. ప్రాథమికం అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు 30 బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దుండగుడు ఉగ్రవాద ముఠాలతో సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఆ అనుమానాలు తప్పు అని తేలింది. నిందితుడి కోసం పోలీసులు ఇంకా తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ కేసులో సైఫ్ సతీమణి, ప్రముఖ నటి కరీనా కపూర్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం, దాడి జరిగిన రాత్రి నిందితుడు గృహంలో చొరబడి పిల్లల గదిలోకి వెళ్లాడు. తన కుమారుడిపై నిందితుడు దాడి చేయబోతున్నట్లు అనిపించడంతో సైఫ్ అతనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సైఫ్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. పరిస్థితి సీరియస్ గా మారడంతో సైఫ్ ఇంట్లోని పిల్లలు, మహిళలను మరో అంతస్తుకు తరలించారు.

కరీనా వాంగ్మూలం ప్రకారం, దుండగుడు ఇంట్లోకి వచ్చినప్పటికీ, ఎలాంటి ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకోలేదు. ఇది స్వాధీనం కాకుండా చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. దాడి అనంతరం కరీనా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆమెను అక్క కరిష్మా కపూర్ తమ ఇంటికి తీసుకెళ్లి ఓదార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బాలీవుడ్‌ను కుదిపేసినప్పటికీ, పోలీసుల గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. నిందితుడి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, త్వరలోనే అతడు పట్టుబడతాడని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

This post was last modified on January 18, 2025 2:19 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago