మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన చేశారు కానీ విపరీతమైన థియేటర్ల కొరత కారణంగా ఆ ఆలోచన మానుకున్నారు. అయితే కొత్త డేట్ కోసం మల్లగుల్లాలు పడిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా మార్చి 28 లాక్ చేస్తూ అధికారిక పోస్టర్ వదిలారు. ఇది చూశాక పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 అఫీషియల్ డేట్ అదే. నెలల క్రితమే ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ మొన్నో లిరికల్ సాంగ్ కూడా వదిలారు.
ఇప్పుడు హఠాత్తుగా రాబిన్ హుడ్ వస్తుందంటే పవన్ ఫ్యాన్స్ కు సందేహం రావడం సహజం.పైగా పవర్ స్టార్ వీరాభిమాని నితిన్ క్లాష్ కు ఏ మాత్రం సిద్ధపడడు. దీని వెనుకో ఆసక్తికరమైన టాక్ తెలిసింది. హరిహర వీరమల్లుని పంపిణిని మైత్రినే తీసుకుందట. కాకపోతే ఖచ్చితంగా మార్చి 28 రిలీజ్ చేయడం గురించి నిర్మాత ఏఎం రత్నం ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారట. దీంతో సేఫ్ సైడ్ కోసం వేరొకరు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చి 28 లాక్ చేశారని తెలిసింది. ఒకవేళ వీరమల్లు ఒరిజినల్ డేట్ కే కట్టుబడితే అప్పుడు రాబిన్ హుడ్ తిరిగి నిర్ణయం మార్చుకుంటుందని సమాచారం.
మొత్తానికి విడుదల తేదీల వ్యవహారం రాను రాను సస్పెన్స్ సినిమాలను మించిపోతోంది. ప్రొడ్యూసర్లు పోటీ తక్కువగా ఉన్న మంచి సీజన్ కోసం ముందుగా అలెర్ట్ అవ్వాల్సిన అవసరం పెరిగిపోతోంది. లేదంటే కాంపిటీషన్ లో డేట్లు మిస్సయిపోయి వసూళ్లు రిస్క్ లో పెట్టాల్సి ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీష్మ కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, లిరికల్ సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది.దీని సంగతి సరేకానీ శివరాత్రికి రావాలనుకున్న నితిన్ మరో సినిమా తమ్ముడు వేసవికి వెళ్లే సూచనలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on January 18, 2025 3:52 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…